Apple Diet : 5 రోజుల ఆపిల్ డైట్ తో 5 కేజీల బరువు తగ్గటం ఎలాగంటే ! తప్పక తెలుసుకోవలసిన విషయాలు ఇవే ?

ఆపిల్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్ ఫైబర్ మొదలైనవి ఉంటాయి. అదే సమయంలో, దాని లోపల కేలరీలు 80 నుండి 100 మధ్య మాత్రమే ఉంటాయి. ఆపిల్ మన నాడీ వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది.

Apple Diet : ప్రస్తుత రోజుల్లో, బరువు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గటం కోసం అనేక రకాల సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. అయితే కొంతమంది బరువు తగ్గడానికి వ్యాయామాలు, ఉపవాసాలతో ఎన్నోవిధాలుగా కష్టపడుతుంటారు. మరికొందరు బరువు తగ్గించుకునే ప్రయత్నాలన్నింటిని మధ్యలోనే ఆపేస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసం సులభంగా బరువు తగ్గే మార్గం సరైన విధానం ఒకటి మీ ముందుకు తీసుకువస్తున్నాం.. కేవలం 5 రోజుల్లో 5కేజీల బరువు తగ్గేందుకు ఆపిల్ డైట్ ఎంతగానో సహాయపడుతంది. తక్కువ వ్యవధిలో 5కేజీలు తగ్గటం అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదు. అయితే ఈ ఆపిల్ డైట్ విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : kalonji Benefits : బరువు తగ్గటంతోపాటు, షుగర్ ను కంట్రోల్ లో ఉంచే గింజల పొడి ఇదే ?

ఆపిల్ డైట్ అంటే ;

బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్న వారు కేవలం 5 రోజుల పాటు యాపిల్ డైట్ తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆపిల్ డైట్ అంటే ఆహారంలో యాపిల్స్ ను చేర్చుకోవటమే. మొదటి రోజు అల్పాహారం, మధ్యాహ్నం , రాత్రి భోజనం గా యాపిల్స్ మాత్రమే తీసుకోవాలి. ఇలా 5 రోజుల పాటు ఇదే డైట్ విధానాన్ని కొనసాగించాలి. వీటికి తోడుగా ఆకలైతే మధ్యలో ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్ స్మూతీస్, ప్రొటీన్ షేక్స్, మజ్జిగ వంటి వాటిని తీసుకోవాలి. ఈతరహాల ఆపిల్ డైట్ విధానాన్ని అనుసరించటం ద్వారా కేవలం 5 రోజుల తరువాత బరువు తగ్గటం ప్రారంభమౌతుంది.

READ ALSO : Eating Fruits : బరువు ఎక్కువ ఉన్నవాళ్లు పండ్లు తినొచ్చా…?

ఆపిల్ డైట్ ను అనుసరించాల్సిన విధానం ;

ఆపిల్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్ ఫైబర్ మొదలైనవి ఉంటాయి. అదే సమయంలో, దాని లోపల కేలరీలు 80 నుండి 100 మధ్య మాత్రమే ఉంటాయి. ఆపిల్ మన నాడీ వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది. డైట్ లో ఆపిల్ చేర్చుకోవటం వల్ల అతిగా తినాలన్న కోరికలు తగ్గుతాయి. కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ మొత్తంలో తినలేము.

READ ALSO : Sattu Pindi Benefits : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పిండి సూపర్ ఫుడ్ !

ఆపిల్ డైట్ లో యాపిల్ మాత్రమే తినాల్సి ఉంటుంది. ఆపిల్ లోపల ఉండే ఫైబర్ శరీరంలో ఉన్న కొవ్వు అణువులను బంధిస్తుంది. ఈ కారణంగా, కొవ్వు ఉత్పత్తి ఆగిపోతుంది. చక్కెరను కొవ్వుగా మార్చడాన్ని ఆపివేస్తుంది. సాధారణంగా భోజనానికి ముందు యాపిల్ తీసుకుంటే, అది ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

READ ALSO : Weight Loss : బరువు తగ్గడంలో భాగంగా అనుసరించాల్సిన ముఖ్యమైన చిట్కాలు !

ఆపిల్ డైట్ లో మొదటి రోజున ఆపిల్స్ మాత్రమే తినాల్సి ఉంటుంది. అయితే మిగతా నాలుగు రోజుల్లో యాపిల్స్ ఆహారంలో ప్రధాన భాగంగా చేసుకోవటంతోపాటు, ఇతర పండ్లు, కూరగాయలను తినవచ్చు. డైట్ అనుసరించిన 5 రోజులలో రోజుకు 1200 కేలరీల కంటే ఎక్కువ మోతాదులో తినరాదు. మూడవ రోజు నుండి ఐదవ రోజు వరకు ఆహారంలో యాపిల్స్ తోపాటు ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్ స్మూతీస్, ప్రొటీన్ షేక్స్ మరియు పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈసమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు