Weight Loss : బరువు తగ్గడంలో భాగంగా అనుసరించాల్సిన ముఖ్యమైన చిట్కాలు !

నెమ్మదిగా తినడం అనేది శక్తివంతమైన బరువు తగ్గించే వ్యూహంగా చెప్పవచ్చు. నెమ్మదిగా తినడం శరీరం మెదడుకు సంపూర్ణత్వం యొక్క సంకేతాలను ప్రభావవంతంగా పంపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Weight Loss : బరువు తగ్గడంలో భాగంగా అనుసరించాల్సిన ముఖ్యమైన చిట్కాలు !

Weight Loss

Weight Loss : ఇటీవలి కాలంలో అధిక బరువు అన్నది చాలా మందిలో పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు కారణంగా ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో వైద్యుల సూచలనతో బరువు తగ్గే ప్రయత్నాల్లో అనేక మంది ఉన్నారు. కొంత మంది ఆహారపరమైన పరిమితులు విధించుకోవటం, వ్యాయామాలు వంటి వాటిని రోజువారిగా అనుసరించటం వంటి వాటి ద్వారా బరువు తగ్గేందుకు చూస్తున్నారు. అలాంటి వారికి కొన్ని చిట్కాలు ఎంతగానో సహాయపడతాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Okra for Diabetes : డయాబెటిక్-ఫ్రెండ్లీ ఆహారంగా బెండకాయ ఎలా తోడ్పడుతుందంటే ?

బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న వారికి ఉపకరించే చిట్కాలు ;

1. నిలబడి లేదా టీవీ చూస్తూ భోజనం చేయవద్దు ;

ఇష్టమైన సన్నివేశాలను చూస్తున్నప్పుడు చాలా మంది చిరుతిళ్లను తింటుంటారు. ఈ క్రమంలో అతిగా తినేస్తున్న విషయం గ్రహించరు. టెలివిజన్ చూసే పరధ్యానంలో ఉన్నప్పుడు , నిలబడి భోజనం చేసేటప్పుడు ఎక్కువ కేలరీలు తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. తినే సమయంలో టేబుల్ పై కూర్చోవడం, క్రింద కూర్చొని తినటం వల్ల తినే ఆహారంపై దృష్టి పెట్టవచ్చు. ఆహారాన్ని నెమ్మదిగా నములుతూ ఆస్వాదిస్తూ తినవచ్చు. దీంతో కడుపు త్వరగా నిండిపోతుంది. ఇది బరువు నిర్వహణను ప్రోత్సహిస్తుంది.

2. ఆహారాన్ని నెమ్మదిగా తినటం ;

నెమ్మదిగా తినడం అనేది శక్తివంతమైన బరువు తగ్గించే వ్యూహంగా చెప్పవచ్చు. నెమ్మదిగా తినడం శరీరం మెదడుకు సంపూర్ణత్వం యొక్క సంకేతాలను ప్రభావవంతంగా పంపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రతి ముద్దను ఆస్వాదించడం ద్వారా అతిగా తినే అవకాశం తక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి సమయాన్ని కేటాయించటం వల్ల మెరుగైన పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

READ ALSO : Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

3. కడుపు నిండినట్లు అనిపించిన వెంటనే తినడం మానేయాలి ;

బరువు తగ్గడానికి పురాతన కాలంనాటి నుండి చెప్పే విషయాల్లో ముఖ్యమైనది శరీరం పంపిన సూచనలను గ్రహించటం. కడుపు నిండిన అనుభూతి కలిగినప్పుడు శరీరం తగినంత పోషణను పొందిందని చెప్పటానికి ఇది సంకేతం. ఈ సంకేతాన్ని విస్మరించి అతిగా తినడం వల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది. శ్రద్ధగా తినడం, కడుపు నిండిన సంతృప్తి కలిగిన సమయంలో తినటం ఆపివేయడం అనేది సమర్థవంతంగా బరువు నిర్వహణకు దోహదపడుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

4. భోజనం మానేయడం మానుకోవాలి ;

సమయం ప్రకారం రోజువారి భోజనాన్ని తీసుకోవాలి. అలా కాకుండా కొంతమంది బరువు తగ్గటం కోసం భోజనం చేయకుండా మానుకుంటుంటారు. ఇలా చేయటం బరువు తగ్గించే వ్యూహం కాదు. భోజనాన్ని తినటం మానేసినప్పుడు శరీరం ఆకలితో అలమటించే స్థితికి చేరుకుంటుంది. దీని వల్ల ఆ తర్వాత రోజు అతిగా తినేందుకు అవకాశం ఉంటుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సూచిస్తోంది. దీని వల్ల జీవక్రియను నెమ్మదిస్తుంది. కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయడం కష్టతరం చేస్తుంది. ఆరోగ్యకరంగా బరువును తగ్గటానికి రోజంతా క్రమం తప్పకుండా, సమతుల్య భోజనం తీసుకోవటం అవసరం.

READ ALSO : Healthy Eating : రోగాలకు దూరంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి !

5. పోషకాహార లేబుల్‌లను చెక్ చేయటం ;

ప్రాసెస్ చేసిన ఆహారాలు తినటమన్నది ఆధునిక జీవనంలో ప్రధాన భాగమైంది. అయితే వాటిలోని పోషకాల మోతాదుల గురించి తెలుసుకునేందుకు వాటిని తినబోయే ముందు పోషకాహార లేబుల్‌లను చదవడం అన్నది ముఖ్యం. దీని వల్ల బరువు తగ్గించే ప్రయాణంలో గణనీయమైన మార్పును గమనించవచ్చు. తక్కువ కేలరీల ఉత్పత్తులపై శ్రద్ధ పెట్టటానికి అవకాశం ఉంటుంది. అలాగే చక్కెరలు, అనారోగ్య కొవ్వుల విషయంలో జాగ్రత్త పడవచ్చు.

చివరగా బరువు తగ్గే ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఈ చిన్నచిన్న సలహాలు అత్యంత ప్రభావవంతంగా తోడ్పడతాయి. ఈ చిట్కాలు, శాస్త్రీయ ఆధారాలు మద్దతుగా నిలుస్తాయి. బరువు తగ్గడానికి మన శరీరం యొక్క సంకేతాలపై శ్రద్ధ పెట్టాలన్న విషయాన్ని మనకు గుర్తుచేస్తాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం ఉత్తమం.