శాశ్వతంగా గురకపోవాలా.. ఈ ట్యాబ్లెట్‌తో అంతా సెట్

శాశ్వతంగా గురకపోవాలా.. ఈ ట్యాబ్లెట్‌తో అంతా సెట్

Updated On : October 27, 2020 / 6:02 PM IST

Snoring (గురక) అనేది ఎవ్వరూ నియంత్రించలేనిది.. నిద్రపోయేవాళ్లు కలల్లో విహరిస్తూ శరీరానికి రిలాక్స్ పొందుతారేమో కానీ, పక్కన పడుకున్న వారికి మాత్రం మెలకువతోనే చుక్కలు లెక్కపెడతారు. ఈ గురక కారణంగా గొడవలు, నిద్రలేని రాత్రులు చూడాల్సిన పరిస్థితిని చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. మరి దీనికి ఎటువంటి రెమెడీ లేదా..

అసలు గురక ఎందుకు పెడతారంటే..

కండరాల మధ్యలో నుంచి శ్వాసకు ఆటంకం ఏర్పడితే పెద్దగా గురక వస్తుంది. ఒబెసిటీ ఉన్న వాళ్లలో ఇది చాలా కామన్. దీని కారణంగా శ్వాసకు ఇబ్బంది రావడం, గురక వంటివి వస్తుంటాయి. ఎవరైనా వ్యక్తి పడుకున్న తర్వాత కండరాల్లోని గాలి మార్గం సహజంగానే రిలాక్స్ అవుతుంది.



కానీ, ఈ సమస్య ఉన్న వారు మాత్రం స్లీప్ అప్నోతో బాధపడతారు. ఒక్కోసారి ఈ కండరాలు పూర్తిగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. గొంతులో ఉన్న చిన్న గ్యాప్ తో గాలి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆ గాలి బయటకు రావడం అదే సమయంలో శ్వాస తీసుకోవాల్సి రావడంతో గురక పెద్దగా వినిపిస్తుంది.

ఈ పిల్(మందు) ఎలా పనిచేస్తుంది?

2018లో బ్రిగామ్, బోస్టన్ లోని మహిళల హాస్పిటల్ కు చెందిన రీసెర్చర్లు 20మందిపై స్టడీ నిర్వహించారు. వారికి రెండు రకాల డ్రగ్స్ ను ఇవ్వడంతో అద్భుతమైన ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది.

వాటిల్లో ఒకటి ఆటోమోక్సిటైన్. నిజానికి ఇది 20సంవత్సరాలుగా వాడుకలో ఉంది. హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్న పిల్లలకు దీనిని సూచిస్తుంటారు వైద్యులు.

మరొకటి ఆక్సిబ్యూటీనిన్. యూరినరీ ఇన్‌కాంటినెన్స్ సమస్య ఉన్న వాళ్లకు ఇది వాడతారు. కండరాల్లో ఆటంకాలు తొలగించి బ్లాడర్‌ను ఫ్రీ చేస్తుంది. ఇవి రెండు మెడిసిన్లు కండరాలను కంట్రోల్ చేయడానికి వాడతారు. అందుకే ఈ రెండు రకాల మందులను స్టడీలో వాడారు. ఫలితంగా గ్రేట్ ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది.

AD109 అనే కోడ్ తో ఉన్న కొత్త మెడిసన్ ఈ రెండు రకాల కాంబినేషన్‌తో వస్తుంది. అమెరికన్ కంపెనీ ఈ డ్రగ్ తయారుచేస్తూ వస్తుంది. ఎఫెక్టివ్ గా పనిచేసినా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేదని గమనించాలి.