Suffering From Anemia : ఈ లక్షణాలు కనిపిస్తే మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లే!

హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి విటమిన్ ఏ మరియు విటమిన్ సి గల ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అందులోను ముఖ్యంగా ఆకుకూరలు, నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలోని రక్తహీనతన సమస్య నుండి బయటపడవచ్చు. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి.

Suffering From Anemia : ఈ లక్షణాలు కనిపిస్తే మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లే!

If these symptoms appear then you are suffering from anemia!

Updated On : January 24, 2023 / 10:17 AM IST

Suffering From Anemia : శరీరంలో ఐరన్ లోపించడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా చాలా మందికి రక్తహీనత సమస్య వస్తుంటుంది. దీనిని ఎనీమియా అని కూడా అంటారు. రక్తహీనత అనేది సాధారణంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాళ్లకు పిరియడ్స్ వచ్చే సమయంలో ఎక్కువగా రక్తం పోతుంది కానుక చాలా మందికి ఇలా రక్తహనత వచ్చే అవకాశాలు ఉంటాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి అనేది ప్రతీ ఒక్కరికీ వస్తుంది.

రక్తహీనత వల్ల కనిపించే లక్షణాలు ;

రక్త హీనతతో బాధపడే వారు నీరంసంగా ఉంటారు. కొద్ది దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. ఏకాగ్రత ఉండదు. చిరాకు, కోపం వంటి ఉంటాయి. నిస్సత్తువ, ఆందోళన వంటివి కూడా ఉంటాయి. రక్తం తక్కువగా ఉంటే చర్మం యొక్క రంగు కూడా మారుతుంది. చర్మం పాలిపోయినట్టు అవ్వడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, తరచూ తలనొప్పి, వికారం కలగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కారణంగా ఉండాల్సిన హెయిర్ ఫాల్ కన్నా, అధికంగా హేయిర్ ఫాల్ అవ్వడం,గోర్లు తరుచూ విరుగుతూ ఉంటాయి. రక్తహీనత వల్ల, గుండెకు జరగాల్సిన రక్త సరఫరా సక్రమంగా జరగక, గుండె పనితీరు దెబ్బతింటుంది.

చిన్న పని చేసిన అలసటగా అనిపించడం, గుండె చప్పుడు మనకే వినిపించేంత ఆత్రుత ఉండడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో ఐరన్ లోపం వున్నట్టే. విటమిన్‌ బి 12 లోపం,ఐరన్‌ లోపం, విటమిన్‌ డి లోపం వల్ల ఎనీమియా వస్తుంది. రక్త హీనత ఏర్పడినప్పుడు కాల్షియం సరిగా శోషించుకోకపోవడం వల్ల,కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడి ఎముకలు గుల్లబారుతాయి. మరికొన్ని లక్షణాల్లో మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది. తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత అందుకు కారణం అయి ఉండవచ్చు. ఎదుగుదలను రక్తహీనత దెబ్బతీస్తుంది. రక్తహీనత సమస్య పెద్దవారి కంటే పిల్లలలోనే ఎక్కువ శాతం కనిపిస్తుంది.

రక్తహీనత ఉన్న వారికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. చాతీలో నొప్పి రావొచ్చు. గుండె సంబంధింత వాధ్యులతో బాధపడుతుంటారు. నడుస్తుంటే, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. దీర్ఘకాల వ్యాధులు కూడా హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కిడ్నీ వ్యాధులు, టీబీ, సికల్‌సెల్‌ ఎనీమియా లేదా తలసెమియా, ఆర్థరైటిస్, క్యాన్సర్‌ వంటి వ్యాధుల వల్ల హీమోగ్లోబిన్‌ తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలేవి కనిపించినా హిమోగ్లోబిన్‌ పరీక్ష చేయించుకోవడం మేలు. రక్తహీనత నుంచి బయట పడాలంటే ఆహార నియమాలు పాటించాలి.

రక్తహీనత తగ్గించటానికి ;

హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి విటమిన్ ఏ మరియు విటమిన్ సి గల ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అందులోను ముఖ్యంగా ఆకుకూరలు, నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలోని రక్తహీనతన సమస్య నుండి బయటపడవచ్చు. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా వరకూ విటమిన్‌ బి 12 లోపం, ఐరన్‌ లోపం, విటమిన్‌ డి లోపం వల్ల ఎనీమియా వస్తుంది. అందువల్ల మనం తినే ఆహారంలో ఐరన్, విటమిన్‌ బి 12 ఎక్కువగా ఉంటే రక్తహీనత తొలగిపోతుంది.

అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్‌ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. చిక్కుళ్లు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వేరుశనగ పప్పులు కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మేక మాంసం, కోడి మాంసం, చేపలు తినాలి. ఆర్గాన్‌ మీట్స్, లివర్‌లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌ బి 12, జింక్, ఫాస్పరస్‌ అధికంగా ఉంటుంది. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది. ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్ సి ఎక్కువగా వుండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.