Reduce Stress : ఒత్తిడి తగ్గించుకునేందుకు కాఫీ, టీలు మోతాదుకు మించి తాగితే ఎముకలు పెళుసుగా మారతాయ్!

ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక దీని కారణంగా శరీరం నుంచి కాల్షియం బయటికి ఈజీగా వెళ్లిపోతుంది. దీంతో ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి.

Reduce Stress : ఒత్తిడి తగ్గించుకునేందుకు కాఫీ, టీలు మోతాదుకు మించి తాగితే ఎముకలు పెళుసుగా మారతాయ్!

If you drink too much coffee and tea to reduce stress, your bones will become brittle!

Updated On : November 11, 2022 / 2:14 PM IST

Reduce Stress : పరుగులు పెడుతున్న నేటికాలంలో ఒత్తిడి సర్వసాధారణమైంది. ఒత్తిడి ప్రభావం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి ముదిరి డిప్రెషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల తలనొప్పి,ఆందోళన, అలసట, చిరాకు వంటి సమస్యలు కలుగుతాయి. ఒత్తిడిని తట్టుకోవడానికి ఆహారపరంగానూ కొన్నిమార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మనం బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండాలి. కానీ మారిన జీవనశైలి ఇంకా అలాగే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి. మనం తినే కొన్ని ఆహార పదార్ధాలు శరీరం నుండి కాల్షియాన్ని త్వరగా బయటికి పంపిస్తాయి. వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. నిజానికి ఎముకల గట్టితనం అనేది మనం తీసుకునే కాల్షియంపై ఆధారపడి ఉంటుంది.

ఒత్తిడిని అధిగమించేందుకు చాలా మంది టీ, కాఫీలను మోతాదుకు మించి రోజువారిగా తీసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల ఆ ప్రభావం ఆరోగ్యంతోపాటు ముఖ్యంగా ఎముకలపై పడుతుంది. ఈ పానీయాలలో కెఫిన్ పరిమాణం అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల కాల్షియం పై ప్రభావం పడుతుంది. దీంతో కాల్షియం చాలా ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక దీని కారణంగా శరీరం నుంచి కాల్షియం బయటికి ఈజీగా వెళ్లిపోతుంది. దీంతో ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి. ప్రస్తుత కాలంలో కూల్‌ డ్రింక్స్‌ ఇంకా అలాగే కార్బోనేటేడ్ పానీయాల వినియోగం వల్ల ఎముకలపై ప్రభావం పడుతుంది. ఈ పానీయాలలో ఫాస్ఫేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది మన శరీరం నుంచి కాల్షియంను తగ్గిస్తుంది. దీని వల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతుంటాయి. కావట్టి టీ, కాఫీలను ఒత్తిడి తగ్గించుకునేందకని అధిక మోతాదులో తీసుకోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.