amla juice
Amla Fruit Juice : ఉసిరి శీతాకాలపు సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఉసిరిలో అనేక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు దీని వల్ల కలుగుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడం మొదలు జీవక్రియకు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వరకు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం తగించటంలో ఉసిరి కీలకమనే చెప్పాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
READ ALSO : Amla : చలికాలంలో మలబద్ధకం సమస్యను పోగొట్టి, జీర్ణక్రియలను వేగవంతం చేసే ఉసిరి!
జలుబు వంటి అంటువ్యాధులపై పోరాటానికి ఉసిరిని ఉపయోగించవచ్చు. చలికాలంలో ఉసిరి వంటి ఆకుపచ్చ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో కేలరీలు , కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఉసిరిలో విటమిన్ B5, విటమిన్ B6, రాగి, మాంగనీస్ , పొటాషియం వంటి ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
READ ALSO : ఉసిరి కాయ మురబ్బా.. రోజూ పరగడుపున తినబ్బా..
పచ్చి ఉసిరి తాగటం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అధిక మొత్తంలో విటమిన్ సి కారణంగా, ఉసిరిని తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపరు. ఉసిరి రసాన్ని పలుచగా చేసి జ్యూస్ గా తయారు చేసుకుని శీతాకాలంలో సేవించటం వల్ల ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. చలికాలంలో ఆరోగ్యానికి మేలు కలిగించే కొన్ని ఆమ్లా జ్యూస్‌లు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
READ ALSO : Amla Oil : జుట్టు రాలటాన్ని నివారించటంతోపాటు, పెరుగుదలకు తోడ్పడే ఉసిరికాయ నూనె!
ఉసిరి,జీలకర్ర జ్యూస్ ;
కొంచెం వేయించిన జీలకర్ర పొడిని ఉసిరి రసానికి కలిపి తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. జీలకర్రలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం మరియు మాంగనీస్ ఉండటం వల్ల ఈ పానీయం ఆరోగ్యవంతమైనదని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి, జీలకర్ర నీటిని తయారు చేయడానికి, ఒక చెంచా జీలకర్రను ఒక గ్లాసు వేడి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఉంచి దానికి అరకప్పు ఉసిరి రసాన్నిజోడించాలి. తరువాత సేవించాలి. అలాగే ఒక కప్పు వేడి నీటిలో అర కప్పు ఉసిరి రసం కలిపి అందులో వేయించిన జీలకర్రను పొడిగా చేసి కలుపుకోవాలి. ఆ తరువాత మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
READ ALSO : Amla For Diabetes : షుగర్ వ్యాధితో బాధపడే వారికి అద్భుతమైన ఔషధం ఉసిరికాయ!
ఉసిరి – అల్లం రసం ;
అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగించే మరొక సూపర్ ఫుడ్ అల్లం. ఈ మూలికలో జింజెరాల్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది దగ్గు, గొంతు నొప్పి, ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరి-అల్లం రసం చేయడానికి తయారీకి సంబంధించి 1-2 తరిగిన ఉసిరి ముక్కలు, ఒక చెంచా అల్లం రసం, 3-4 పుదీనా ఆకులు మరియు ఒక కప్పు గోరువెచ్చని నీటిని కలిపి బ్లెండర్ లో బ్లెండ్ చేయాలి. అనంతరం ఒక గ్లాసులో పోసి దానికి కాస్త మిరియాలపొడి, చాట్ మసాలాపొడి కలిపి ఈ పానీయం సేవించటం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
READ ALSO : Amla Pieces : ఆరోగ్యానికి మేలు చేసే ఎండు ఉసిరి ముక్కలు!
ఉసిరి రసం ;
ఉసిరి రసం ఖాళీ కడుపుతో సేవించటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని ఉసిరి కాయ ముక్కలను తీసుకుని వాటిలో కప్పు నీటిని పోయాలి. వాటి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఆ నీటిని ప్రతిరోజు ఉద్యం ఖాళీ కుడుపుతో సేవించాలి.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.