Luck Signs : అదృష్టం వరించే ముందు కనిపించే సంకేతాలు .. వీటిని గుర్తిస్తే జీవితమే మారిపోతుంది..

మంచి రోజులొచ్చాయి అని శుభ సంకేతాలు కనిపిస్తాయి. మంచి రోజులు వచ్చినప్పుడు లేదా అదృష్టం మీకు అండ‌గా ఉన్నప్పుడు, కొన్ని సంకేతాలు వస్తాయి. మరి సంకేతాలు ఏమిటో తెలుసా..?

Luck Signs : అదృష్టం వరించే ముందు కనిపించే సంకేతాలు .. వీటిని గుర్తిస్తే జీవితమే మారిపోతుంది..

Luck signs In Your life

Luck signs : ఎంత కష్టపడుతున్నా ఫలితం దక్కటంలేదు..అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో అంటూ ఎన్నో సందర్భాల్లో ఆవేదన చెందుతుంటాం. కష్టపడిన రూపాయి కూడా చేతిలో మిగలటంలేదు…ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో..అదృష్ట లక్ష్మి ఎప్పుడు వరిస్తుందో..అసలు ఈ జన్మకు అటువంటి యోగం ఉందో లేదో..ఏంటో ఈ జీవితం..? నాకంటూ ఓ టైమ్ వస్తుందా..? అని తెగ దిగులుపడిపోతుంటాం. కానీ అదృష్టం వరించే ముందు కొన్ని సంకేతాలు వెలువడతాయని వాటిని గుర్తించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాటిని గుర్తించి తగిన జాగ్తత్తలు తీసుకోవాలి.

మంచి రోజులొచ్చాయి అని శుభ సంకేతాలు కనిపిస్తాయట. మంచి రోజులు వచ్చినప్పుడు లేదా అదృష్టం మీకు అండ‌గా ఉన్నప్పుడు, కొన్ని సంకేతాలు వస్తాయట. మరి సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం..

ఇంట్లో పూజలో కొబ్బరి కాయ కొడితే కాయలో పువ్వు రావటం..
ఇంట్లోకి నల్ల చీమలు రావటం..
ఇంటి ఆవరణ..లేదా ఇంటి చూరు..ఇంటి గుమ్మం వద్ద ఇలా ఇంటికి సంబంధిన పరిసరాల్లో ఏదైనా పక్షి గూడు కట్టుకోవటం..పిల్లల్ని చేయటం..
ఇంటి నుంచి బయటకు వెళుతున్న సమయంలోను..గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలోను తెల్ల రంగు ఆవు కనిపించటం..
ఉదయాన్నే బ్రాహ్మలు కనిపించటం..లేదా ఎదురు రావటం..
ఇంట్లో వెలిగించిన దీపం నుంచి చప్పుళ్లు రావటం..అంటే దీపం అటు ఇటు చెదిరి చప్పుడు వస్తుంది..అలా వస్తే దీపం ఆరుతుందని కంగారుపడొద్దు..ఆ శబ్దాలు మంచికోసమేనట..
మంగళవారం నాడు కోతులు ఇంటిపైకి రావటం..అలా వస్తే వాటిని కొట్టి తరిమేయవద్దని పండితులు సూచిస్తున్నారు..కోతులు అంటూ హనుమంతుడి ప్రతిరూపాలని వాటిని కొట్టి తరిమేయవద్దని వీలైతే వాటికి ఆహారం పెడితే మంచి జరుగుతుందని చెబుతున్నారు..
అలాగే నెమలి కనిపిస్తే శుభం జరుగుతుందట..
పాలు కాస్తున్నప్పుడు పొంగటం..
కొత్త జంట కనిపించటం లేదా ఎదురు రావటం..
ఏదైనా పక్షి స్పర్శ శరీరానికి తగలటం..లేదా పక్షి మీద వాలినా శుభం కలుగుతుందట..
ప్రయాణాలు చేస్తున్న‌ సమయంలో పాములు, కోతులు కనిపిస్తే, అది మంచి సమయానికి శుభసూచకమట. ఆర్థిక బాధల్ని తొలగించే సంకేతమట..
ఇంట్లో గబ్బిలం గూడు ఉంటే చాలా చాలా శుభప్రదమ‌ట..
రాలుతున్న నక్షత్రాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుందట..ఎంత‌టి క‌ఠిన‌మైన‌ ఇబ్బందులు పడుతున్నా రాలుతున్న నక్షత్రాన్ని చూస్తే ఆ సమయంలో ఏమైనా కోరుకుంటే ఆ కోరిక 30 రోజుల్లో నెరవేరుతుంద‌ట..
తాబేలును చూస్తే చాలా మంచిది. తాబేలు సాక్షత్తు విష్ణు స్వరూపం. కూర్మావతారం అయిన విష్ణువు అవతారాలలో తాబేలు కూడా ఒకటి. కలలో తాబేలు క‌న‌బ‌డితే అదృష్టానికి సంకేతం..
ఏనుగు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగు నిలబడితే..సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందట..
కోకిల కనిపించినా..కోకిల కూత విన్నా శుభసూచకమే. ఇది ఇంటికి సంపద రాకకు సూచన..
పాలు, పెరుగు శుభానికి సంకేతాలు.. ఉదయం నిద్ర లేవగానే ముందుగా పాలు లేదా పెరుగు కనిపిస్తే అది మీ అదృష్టానికి సంకేతం.

ఇలా గుర్తించండి..

వీటిని గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు. గుర్తించటమంటే..ఇంటిమీదకు కోతులు వచ్చాయని కొట్టి తరిమేయొద్దు. పాలు పొంగిపోతున్నాయని కంగారు పడి పొంగే పాలమీద నీల్లు చల్లొద్దు. పొంగినంత వరకు పొంగుతాయి అని వదిలేయటం మంచిదట.

అలాగే ఏదైనా పక్షి తగిలితే చిరాకు పడొద్దు..పక్షి మీ ఇంటి పరిసరాల్లో గూడు కట్టుకుంటే సాధ్యమైనంత వరకు దానికి సహకరించేలా ఉండాలి. అంతే తప్ప ఆ పక్షుల్ని కొట్టి తరిమేయొద్దు..

ఏనుగు కనిపిస్తే భయపడొద్దు. అది లక్ష్మీదేవి స్వరూపమని భావించి ఏదైనా ఆహారం పెడితే మంచిది..

ఇంట్లోకి చీమలు వస్తే చీమల మందు వేసి చంపేయొద్దు..

ఇలా కొన్ని శుభ సంకేతాలను గుర్తించి దానికి అనుగుణం నడచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..