Baby Skin Care : శిశు చర్మ సంరక్షణలో రసాయన ఉత్పత్తుల నివారణ తప్పనిసరా?
తల్లిదండ్రులకు శిశువు సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగించే పదార్థాలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. పిల్లలు చాలా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. వారి చర్మానికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో కొంత అదనపు శ్రద్ధ అవసరం.

Is it necessary to avoid chemical products in baby skin care?
Baby Skin Care : నవజాత శిశువు యొక్క చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తుల వల్ల వారి చర్మం చికాకుకు గురవుతుంది. శిశువులకు మృదువైన చర్మాన్ని పెంపొందించే సున్నితమైన చర్మ సంరక్షణా చికిత్స అవసరం. తల్లిదండ్రులకు శిశువు సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగించే పదార్థాలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. పిల్లలు చాలా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. వారి చర్మానికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో కొంత అదనపు శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఇది పెద్దల చర్మం కంటే చర్మ వ్యాధులకు చికాకుకు గురయ్యే అవకాశం ఉంటుంది. శిశువు ఉత్పత్తులలోని కఠినమైన రసాయనాలు మనం ఊహించిన దాని కంటే పిల్లల చర్మానికి ఎక్కువ హాని కలిగిస్తాయి.
శిశువుల అభివృద్ధికి మరియు పోషణకు హానికరమైన రసాయనాలు లేని అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు అవసరం ఉంటుంది. పారాబెన్‌లు, సల్ఫేట్‌లు, సిలికాన్‌లు, మినరల్ ఆయిల్స్ వంటి బేబీ బాత్ చర్మ సంరక్షణ ఉత్పత్తుల విషయానికి వస్తే, కొన్ని రసాయనాలను నివారించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టాక్సిన్స్ మరియు అలర్జీలు. ఈ రసాయనాల ప్రభావం శిశువు యొక్క చర్మాన్ని చికాకు పెడతాయి. అంతేకాకుండా శ్వాసకోశ , పునరుత్పత్తి అవయవ పనితీరుతోపాటు, సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. పిల్లల విషయానికి వస్తే తేలికపాటి సువాసనలు కల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
బేబీ పౌడర్ వంటి నిర్దిష్ట ఉత్పత్తుల విషయానికి వస్తే, టాల్క్‌కు బదులుగా, ఓట్స్, కార్న్ స్టార్చ్ మరియు కయోలిన్ క్లే వంటి సహజ పదార్ధాలను ఉపయోగించడం వల్ల శిశువులకు సురక్షితం.
చర్మ సంబంధిత ఉత్పత్తులను ఎలా ఎంచుకోవాలి ;
1. pH – మన చర్మం 5.5 pHని కలిగి ఉంటుంది, ఉత్పత్తులు కూడా సాధారణంగా ఇదే పీహెచ్ ని కలిగి ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
2. సువాసన – సువాసన ఉత్పత్తులు అనుభూతిని కలిగించటంలో తోడ్పడతాయన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఇవి అలెర్జీ మరియు క్యాన్సర్ కారకాలు కాబట్టి సాధ్యమైనంత వరకు సువాసన లేకుండా ఉండాలి.
3. ఏ సబ్బుకైనా నురుగును అందించే సోడియం లారిల్ సల్ఫేట్ చాలా హానికరమైన రసాయనం కాబట్టి నురగలేని సబ్బులను ఎంచుకోవాలి.
4. సన్‌స్క్రీన్ అనేది పెద్దలకు ఎంత ముఖ్యమో శిశువులకు అంతే ముఖ్యం. పిల్లలకు ఇది రసాయన రహితంగా ఉండాలి. జింక్ ఆక్సైడ్ ఉన్న ఫిజికల్ సన్‌స్క్రీన్ వాడాలి. కెమికల్ సన్‌స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో ఆక్సిబెంజోన్, అవోబెంజోన్స్, పాబా మొదలైనవి ఉంటాయి, ఇవి పిల్లలపై హార్మోన్ల పై ప్రభావాన్ని చూపిస్తాయి.