Turmeric Milk : గర్భిణీ స్త్రీలు పసుపు పాలు తాగటం శ్రేయస్కరం కాదా?

కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నవారు పసుపు పాలు తాగటం అన్నది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పసుపు పాలు తాగకూడదు.

Turmeric Milk : గర్భిణీ స్త్రీలు పసుపు పాలు తాగటం శ్రేయస్కరం కాదా?

Turmeric Milk

Turmeric Milk : భారత దేశంలో ఆరు వేల సంవత్సరాల నుండి పసుపుకు విశిష్టమైన ప్రాధన్యం ఉంది. ప్రతి ఇంటి వంటిట్లో పసుపు లభిస్తుంది. వ్యాధుల నివారణకి, చర్మ సౌందర్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు, కాన్సర్ వ్యాధి నయం చేయటానికి పుసుపు ఉపయోగపడుతుందని చెప్తుటారు. ముఖ్యంగా దగ్గు, జలుబు తో బాధ పడేవారు వేడి నీటి లో పసుపు వేసి మరిగించి ఆవిరి పడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గొంతు నొప్పి, కఫం తగ్గడానికి రాత్రి పడుకునేముందు ఒక గ్లాస్ పాలలో కొంచెం పసుపు, మిరియాల పొడి కలిపి మరిగించి బెల్లం కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. పసుపు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. పసుపులో ఎన్నో సహజ సిద్ద ఔషధ గుణాలు ఉన్నాయి.

అయితే అదే సమయంలో పసుపు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు ముఖ్యంగా చాలా మంది చిన్న జలుపు,దగ్గు సమస్య వచ్చినా పసుపు పాలు తాగటం అన్నది అలవాటు. అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నవారు పసుపు పాలు తాగటం అన్నది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పసుపు పాలు తాగకూడదు. పసుపు పాలు ఉదరంలో వేడిని పెంచుతాయి. గర్భాశయంలో నులినొప్పి, రక్తస్రావం, తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది. మొదటి మూడు నెలలు గర్భదారణ సమయంలో పసుపు పాలు తాగడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే గర్భిణీ స్త్రీలు పసుపు పాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న వారు పసుపు పాలు తాగకూడదు. ఒక వేళతాగితే శరీరంలో వేడి పెరుగుతుంది. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్న వారు నిపుణుల సలహా లేకుండా పసుపు పాలను తాగకూడదు. అలాంటి వారికి.. పసుపు పాలు సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. రక్తహీనత ఉన్నవారు పసుపు పాలు తాగితే శరీరంలోకి వెళ్లిన పసుపు పాలు, రక్తంలోని ఐరన్‌ మూలకాలను గ్రహించి ఐరన్ లోపం ఏర్పడేలా చేస్తుంది. పిత్తాశయంలో రాయి సమస్యతో బాధపడుతుంటే పసుపు పాలు తాగకూడదు. ఇది సమస్యను మరింత పెంచుతుంది.