CDC new guidelines : ఉపరితలాల నుంచి కరోనా సోకే ముప్పు చాలా తక్కువ
ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనావైరస్ మహమ్మారి వ్యాక్సిన్లతో అంతమయ్యేది కాదు.. కొత్త స్ట్రయిన్లతో మ్యుటేట్ అవుతూ అంతకంతకూ శక్తివంతం అమవుతోంది.

Low Risk Of Catching Covid From Surfaces
CDC new guidelines : ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనావైరస్ మహమ్మారి వ్యాక్సిన్లతో అంతమయ్యేది కాదు.. కొత్త స్ట్రయిన్లతో మ్యుటేట్ అవుతూ అంతకంతకూ శక్తివంతం అమవుతోంది. ఇప్పటివరకూ కరోనావైరస్ ఎక్కడైనా ఉపరితలాలు లేదా వస్తువుల ద్వారా సోకడానికి ఎక్కువగా ముప్పు ఉందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (CDC) వెల్లడించింది. కానీ, ఇప్పుడు గణనీయమైన ముప్పు అంతగా లేదని సీడీసీ కరోనావైరస్ గైడెన్స్ ను అప్ డేట్ చేసింది.
ఈ కొత్త సీడీసీ గైడ్ లైన్స్ ను డైరెక్టర్, డాక్టర్ రోచెల్లె వాలెన్ స్కై ప్రవేశపెట్టారు. సాధారణంగా కోవిడ్-19 వైరస్ సోకిన వ్యక్తి నుంచి నేరుగా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అది నోటి తుంపర్లు లేదా గాలిద్వారా వ్యాప్తి చెందవచ్చునని దేశీయ వైద్య సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. వైరస్ కలిసిన ఉపరితాలలు లేదా వస్తువుల ద్వారా వైరస్ సోకే అవకాశం ఉంది. కానీ, ఈ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని సీడీసీ తమ గైడ్ లైన్స్‌ను సవరించింది. ఎవరైనా దగ్గినా లేదా తుమ్మినా ప్రదేశాన్ని తాకి.. కళ్లు లేదా ముక్కును తాకితే వైరస్ వ్యాపించవచ్చునని నివేదికలు చెబుతున్నాయి.
కానీ, అలా ఉపరితాల ద్వారా వైరస్ ఇతరులకు సోకడం 10వేల మందిలో ఒకరికి అరుదుగా జరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలిందని సీడీసీ పేర్కొంది. ఎప్పటికప్పుడూ క్లీనింగ్ చేసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసుకోవచ్చునని సూచించింది. కమ్యూనిటీ ఏరియాల్లో ఇండోర్ లేదా ఔట్ డోర్ పరిసరాల్లోని ఉపరితలాల ద్వారా వైరస్ వ్యాప్తిని శానిటైజేషన్ ద్వారా నియంత్రించవచ్చునడానికి సైద్ధాంతిక మద్దతు ఉందని సీడీసీ పేర్కొంది. ఉపరితాలలను క్లీనింగ్ చేయడానికి సబ్బు, డిటర్జెంట్, శానిటైజర్ వంటి పూర్తి స్థాయిలో ముప్పును తగ్గించలేవని తెలిపింది. ఇండోర్ పరిసరాల్లో మాత్రమే డిజ్ ఇన్ఫెక్షన్ ప్రయోజనకరంగా ఉంటుందని సీడీసీ వెల్లడించింది.