Heart Health : గుండె ఆరోగ్యం కోసం వీటిని రోజు వారి ఆహారంగా!

అధిక చక్కెర,మాంసాహారం,వెన్న,నూనెలు వంటి క్రొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావటానికి దారితీస్తాయి. క్రొవ్వు పదార్ధాలలో కొబ్బరినూనె,డాల్డా,నెయ్యి, వంటివి గుండె జబ్బులకు కారణంగా చెప్పవచ్చు.

Heart Health : గుండె ఆరోగ్యం కోసం వీటిని రోజు వారి ఆహారంగా!

Heart Health

Heart Health : మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె. పిడికిలంత పరిమాణంలో ఛాతి మధ్య భాగంలో ఎడమ ప్రక్క ఉంటుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో గుండెపోటు ప్రమాదాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. అనేక మంది అనుకోని పరిస్ధితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడంతోపాటు , శారీరక వ్యాయామం లేకపోవటమేనని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. ఇందుకు గాను కొన్ని రకాల ఆహారపు అలవాట్లు తోడ్పడతాయి.

అధిక చక్కెర,మాంసాహారం,వెన్న,నూనెలు వంటి క్రొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావటానికి దారితీస్తాయి. క్రొవ్వు పదార్ధాలలో కొబ్బరినూనె,డాల్డా,నెయ్యి, వంటివి గుండె జబ్బులకు కారణంగా చెప్పవచ్చు. గుండె జబ్బులు దరి చేరకుండా ఉండాలంటే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు రోజువారి ఆహారంలో చేర్చుకోవటం మంచిది. ముఖ్యంగా నిమ్మ,నారింజ,బత్తాయి వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. టమోటా,క్యారెట్,బొప్పాయి, మామిడి వంటి పసుపు రంగు మరియు ఎరుపురంగు పండ్లు కూరగాయలు, ఆకుకూరలు విటమిన్ ఎ పొందవచ్చు. వీటిని తీసుకోవటం వల్ల గుండె జబ్బులను దరిచేరకుండ చూసుకోవచ్చు.

సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా దొరికే అద్భుతమైన ఔషద గుణాలుండే అరటి పండ్లు. పైనాపిల్ వంటివాటిని తీసుకోవాలి. కేవలం రుచిలోనే కాకుండా గుండెను పటిష్టంగా ఉంచడంలో ఇవి ఉపయోగపడతాయి. పరిమితికి మించి వీటిని తీసుకోరాదు. ఉల్లిపాయ,వెల్లుల్లి , శనగపప్పులో కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడతాయి. పాలు,ఆకుకూరలు,రాగులు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే పదార్ధాలు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.