8 గంటలకు పైగా నిద్రపోతున్నారా? అయితే మీకు చావు ఖాయం

ప్రతి రోజు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోతున్నారా? అయితే మీ అలవాటును మార్చుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. మనిషికి నిద్ర ఎంత అవసరమో.. అదే నిద్ర ఎక్కువైతే కూడా అంతే ప్రమాదం ఉంది. రోజులో ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరి 8 గంటలకు మించి నిద్రపోవడం వల్ల కలిగే ప్రమాదాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే కోరుకుంటారు. మరి అలా జీవించాలంటే శరీరానికి తిండి ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం అవుతుంది. మనిషి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవటం చాలా అవసరం. మనిషికి నిద్ర ఎంత అవసరమో.. అదే నిద్ర ఎక్కువైతే కూడా అంతే ప్రమాదం ఉంది. చాలా మంది పగటి పూట ఎలాంటి పనిపాట లేకుండా జీవిస్తూ రాత్రి పగలు నిద్రించే వారు కూడా ఉంటారు. రోజులో ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
మీరు 8 గంటలకు మించి నిద్రపోతే మొట్ట మొదటగా శరీరంపై ప్రభావం చూపుతుంది. దాంతో బరువు పెరుగుతారు. అధిక నిద్ర మీ బరువును పెంచుతుంది. చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల డయాబెటిస్ మరియు ఊబకాయంతో సంబంధం కలిగి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బరువు పెరగడం వల్ల శరీర సమస్యలు కూడా పెరుగుతాయి.
అంతేకాదు ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది, మొదడు సామర్థ్యం తగ్గుతుంది. అలాగే మెమరీ సామర్థ్యం కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది. అలా జరిగితే తెలివితేటలను కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు.