World Stroke Day : పక్షవాతం ముందస్తు సంకేతాలు…లక్షణాలు

అస్పష్టమైనమాటలు, మాట్లాడే పదాలలో పొందికలేవటం వంటి ఇబ్బంది అనేది స్ట్రోక్‌కు ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చు. ఒక సాధారణ వాక్యాన్ని తిరిగి మాట్లాడమని అడిగిన సందర్భంలో అతను మాట్లాడటానికి ఇబ్బందిపడితే అది స్ట్రోక్ కావచ్చు.

brain stroke

World Stroke Day : పక్షవాతం దీనినే స్ట్రోక్ అని పిలుస్తారు. స్ట్రోక్ కు కారణాలు, లక్షణాలు నివారణ గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ డేని జరుపుకుంటారు. ప్రచార కార్యక్రమాల ద్వారా స్ట్రోక్ లక్షణాలను ముందస్తుగా గుర్తించి తక్షణ వైద్య సహాయం పొందటం స్ట్రోక్ నివారణ సాధ్యమన్న విషయంపై అందరిలో అవగాహన కల్పించటమే ప్రపంచ మరియు పునరావాసానికి స్ట్రోక్ డే 2023 లక్ష్యం.

READ ALSO : Eating Eggs : డయాబెటిక్ రోగులు గుడ్లు ఆహారంగా తీసుకోవటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయన్న విషయంలో వాస్తవమెంత?

స్ట్రోక్ వచ్చే ముందుగా కొన్ని సంకేతాలు,లక్షణాలను గుర్తించడం చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే త్వరితగతిన చికిత్సపొందటం ద్వారా త్వరగా రికవరీ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు, అడ్డుపడటం (ఇస్కీమిక్ స్ట్రోక్) లేదా రక్తస్రావం (హెమరేజిక్ స్ట్రోక్) కారణంగా స్ట్రోక్స్ సంభవిస్తాయి.

READ ALSO : నడకతో గుండెపోటు, పక్షవాతం, కేన్సర్‌కు చెక్..!

స్ట్రోక్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు ;

ఆకస్మిక తిమ్మిరి, బలహీనత: స్పష్టంగా కనిపించే సంకేతాలలో ఒకటి అకస్మాత్తుగా తిమ్మిరి లేదంటే బలహీనత. ముఖం, చేయి, కాలు ఒక వైపు లాగుతూ ఉండటం జరుగుతుంది. ఆసమయంలో నవ్వమనటం ద్వారా స్ట్రోక్ వచ్చే అవకాశాలను గుర్తించవచ్చు. నవ్వే సందర్భంలో ముఖం యొక్క ఒక వైపు పడిపోతే, అది స్ట్రోక్‌ను సూచిస్తున్నట్లు భావించాలి.

READ ALSO : Paralysis Danger signals : ప్రపంచానికి పక్షవాతం ముప్పు.. చైనా హెచ్చరిక

మాట్లాడటం కష్టంగా మారటం: అస్పష్టమైనమాటలు, మాట్లాడే పదాలలో పొందికలేవటం వంటి ఇబ్బంది అనేది స్ట్రోక్‌కు ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చు. ఒక సాధారణ వాక్యాన్ని తిరిగి మాట్లాడమని అడిగిన సందర్భంలో అతను మాట్లాడటానికి ఇబ్బందిపడితే అది స్ట్రోక్ కావచ్చు.

అర్థం చేసుకోవడంలో సమస్య: గందరగోళం, దిక్కుతోచని స్థితి, ఇతరులను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది , రెండు చేతులను పైకెత్తమనటం, చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని, ఆచరించే విషయంలో వారి సామర్థ్యాన్ని గమనించటం ద్వారా గుర్తించవచ్చు.

READ ALSO : Stroke Risk : పక్షవాతం ముప్పుకు అధిక బరువు, రక్తపోటు అతిపెద్ద కారణాలా ?

తీవ్రమైన తలనొప్పి: ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వస్తండటం ఇది హెమరేజిక్ స్ట్రోక్‌కు సంకేతంగా ఉంటుంది. ఇది మెదడులో రక్తస్రావాన్ని కలిగిస్తుంది.

దృష్టి సమస్యలు: ఒకటి లేదా రెండు కళ్ళు అస్పష్టంగా కనిపించటం , ఒక కన్ను చూపుకోల్పోవటం, ఎదురుగా ఉన్న వస్తువులు , మనుషులు డబుల్ కనిపించటం, మైకంగా ఉండటం, తలతిరగటం, వంటి సమస్యలు స్ట్రోక్ కు ప్రారంభ సంకేతాలు.

READ ALSO :పక్షవాతం ఎందుకు వస్తుంది?

నడకలో ఇబ్బంది: నడిచేసమయంలో బ్యాలెన్స్ కోల్పోవడం, అడుగులు సరిగా వేయలేకపోవటం వంటివి స్ట్రోక్‌ లక్షణాలు.

ప్రారంభ దశ సంకేతాలను గుర్తించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సందర్భంలో సమయం అన్నది చాలా కీలకం. గంటల వ్యవస్ధిలో వైద్యులను సంప్రదించటం ద్వారా వెంటనే చికిత్స అందే అవకాశం ఉంటుంది.