Pickles : ఆరోగ్యానికి హాని చేసే ఊరగాయ పచ్చళ్లు!
పచ్చళ్ళను అప్పుడప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవటం వల్ల పెద్దగా ససమ్య ఉండదు. అయితే మోతాదుకి మించి ఈ పచ్చళ్లను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊరగాయలలో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.

Pickle (1)
Pickles : ఊరగాయ పచ్చళ్లను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. భోజనంలోకి కూర, పప్పు, సాంబారు, పెరుగు ఎంత ముఖ్యమో పచ్చడి అంతే ముఖ్యం. భోజనప్రియులు పచ్చడితోనే అన్నం తినడం మొదలుపెడతారు. కొంతమందికైతే అలసు పచ్చడి లేనిదే ముద్దకూడా దిగదు. చాలా మంది తమ ఇంట్లో ఏడాదికి సరిపడా పచ్చళ్ళను పట్టి ఉంచుకుంటారు. ప్రస్తుతం బిజీ లైఫ్ లో కూరలు వండుకునే సమయం లేక పచ్చళ్లతోనే పూట గడిపేస్తున్నారు. కానీ అది ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది.
పచ్చళ్ళను అప్పుడప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవటం వల్ల పెద్దగా ససమ్య ఉండదు. అయితే మోతాదుకి మించి ఈ పచ్చళ్లను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊరగాయలలో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. దానిలో ఉపయోగించే మసాలాల కారణంగా కొలెస్ట్రాల్, ఇతర సమస్యలు వస్తాయి. ఊరగాయలను తయారు చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్‌లు శరీరానికి హానికరం. శరీరంలో అసిడిటీ, మంటకు కారణమవుతాయి. ఎక్కువగా పచ్చళ్లు తినే వాళ్లలో ఉదరంలో నొప్పి పెరుగుతుంది. మరియు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. పచ్చళ్లలో ఉప్పు, నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అరగడానికి సమయం పట్టడమే కాకుండా, బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అంతే కాకకుండా పెళ్లైన మగవాళ్లు పచ్చళ్లు తినకూడదని చెబుతుంటారు. దాని వెనక బలమైన కారణం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్ఛళ్లు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని, పచ్చళ్లల్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవీ ఉండవని అంటున్నారు. వీటిలో వాడే అధిక నూనెలు కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. సంతానోత్పత్తి బలహీనంగా ఉంటుందని చెబుతున్నారు. ఊరగాయలలో ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక సోడియంతో పాటు అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మసాలా దినుసులు కాకుండా, వెనిగర్ కూడా ఎక్కువ పరిమాణంలో ఊరగాయలలో ఉపయోగించబడుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే అల్సర్, ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఊరగాయ పచ్చళ్లను మోతాదుకి మించి తినరాదు.