60 నిమిషాల్లో 4కిలోల నాన్‌వెజ్ థాలి తినగలరా?.. లక్షన్నర రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ గెల్చుకోవచ్చు!

Bullet Thali eating contest winners a Royal Enfield Classic : మీరు భోజన ప్రియులా? అయితే ఈ ఫుడ్ కాంటెస్ట్ మీకోసమే.. 4 కిలోల నాన్ వెజ్ థాలి తినగలరా? 60నిమిషాల్లో తినడం పూర్తి చేస్తే.. లక్షన్నర విలువైన రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ గెలుచుకోవచ్చు. పుణె శివారులోని శివరాజ్ రెస్టారెంటు ఈ ఫుడ్ కాంటెస్ట్ ప్రకటించింది. కోవిడ్ దెబ్బకు తమ రెస్టారెంటుకు కస్టమర్లు రాక వెలవెలబోయింది. ఎలాగైనా కస్టమర్లను ఆకర్షించేందుకు రెస్టారెంట్ యజమాని అతుల్ వాకియర్ ఈ కొత్త ఫుడ్ కాంటెస్ట్ తీసుకొచ్చారు.
ఎవరైతే ఒక గంటలోపే ఈ బుల్లెట్ థాలి పూర్తి చేస్తారో వారికి బ్రాండ్ కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 బహుమతిగా అందిస్తారంట.. ఈ కాంటెస్టులో పాల్గొనే కస్టమర్లకు టేబుల్ పై 4 కిలోల నాన్ వెజ్ థాలి సర్వ్ చేస్తారు. ఎవరైతే ఈ థాలిని కేవలం 60 నిమిషాల్లోపే పూర్తిగా తినేస్తారో వారికి రూ.1.65 లక్షల విలువైన (ఎక్స్-షోరూం) రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బుల్లెట్ సొంతం చేసుకోవచ్చు.
ఇంతకీ ఈ బుల్లెట్ థాలిలో స్పెషాలిటీ ఏంటి? :
బుల్లెట్ థాలి.. 12 రకాల వంటకాలతో రెడీ చేశారు. ఇందులో 4కిలోల మటన్, చేపలతో థాలిని 55 మంది రెస్టారెంట్ టీం సభ్యులు తయారు చేశారు. చేపలు, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, ప్రాన్ బిర్యానీ ఫ్రైడ్ వంటకాలను కూడా థాలిలో చేర్చారు. ఈ బుల్లెట్ థాలి ధర ఒక్కొక్కటి రూ.2,500 వరకు ఉంటుంది. యజమాని అతుల్ ప్రకారం.. ప్రతి రోజు 65 థాలిలు అమ్ముడుబోతాయని అంటున్నాడు.
రెస్టారెంట్ బుల్లెట్ థాలి చాలెంజ్ పూర్తిచేసేందుకు సోమనాథ్ పవార్ అనే నివాసి ముందుకొచ్చాడు. 60 నిమిషాల్లోనే బుల్లెట్ థాలిని తినడం పూర్తి చేశాడు. అంతే.. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ గెల్చుకున్నాడు. ఇంకా నాలుగు బైకులు కూడా గెల్చుకునే ఛాన్స్ ఉందంట.. ఇలాంటి ఫుడ్ కాంటెస్ట్ నిర్వహించడం మొదటిసారి కాదంట.. ఇదివరకే ఈ తరహా ఫుడ్ కాంటెస్టులను ఎన్నో నిర్వహించామని అంటున్నాడు. గతంలో 60 నిమిషాల్లో 8కిలోల రావన్ థాలి పూర్తిచేసే కాంటెస్ట్ నిర్వహించారు. రూ.5వేల వరకు ప్రైజ్ మనీ అందించారు.