Pre-Wedding Skincare
Pre-Wedding Skincare : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. జీవితకాలం ఆ వేడుక తాలుకూ జ్ఞాపకాలను భద్రంగా దాచుకుంటారు. వధూవరులిద్దరూ ప్రత్యేకంగా కనిపించాలని భావిస్తారు. ముఖ్యంగా పెళ్లికూతురుగా ముస్తాబయ్యే వధువు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. అయితే అప్పటికప్పుడు కాకుండా పెళ్లికి కొద్దిరోజుల ముందే ముఖ్యంగా స్కిన్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే పెళ్లిపీటలపై మెరిసిపోవడం ఖాయం.
బ్యూటీ టిప్స్ కోసం ఎక్కడో వెతుకుతున్నారా? టిక్ టాక్ లో ఈ ఏడుగురిని ఫాలో అవ్వండి
పెళ్లిపీటలపై కూర్చోబోయే వధువు ఆరోజు తను అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటుంది. అలా కోరుకునేవారు చర్మ సంరక్షణపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పెళ్లికి ముందు చేయాల్సిన, చేయకూడని కొన్ని పనులను గురించి తెలుసుకోవాలి. అవి పాటిస్తేనే పెళ్లిపీటలపై చక్కని చర్మకాంతితో మెరిసిపోతారు.
పెళ్లికి ముందు చర్మ సంరక్షణపై దృష్టి పెట్టండి. కొత్త ఉత్పత్తులు, చికిత్సలు వంటి వాటికి సిద్ధమైతే ఖచ్చితంగా పెళ్లికి ఆరు నెలల ముందు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోండి. ప్రతిరోజు సన్ స్క్రీన్‌తో స్కిన్ శుభ్రం చేసుకోండి. టోన్ చేయండి. మాయిశ్చరైజర్ ఉపయోగించండి. మీ చర్మం లోపల నుండి తేమగా ఉంచడానికి కావాల్సినంత నీరు త్రాగండి. చర్మం మృదువుగా ఉండటం కోసం హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ వాడండి. మీ స్కిన్ టైప్ తెలుసుకోవడం కోసం స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. ఫేషియల్, పీల్స్, లేదా కొన్ని ప్రాడక్ట్స్ వాడం వల్ల అవి మీ చర్మానికి సరిపోతాయో లేదో వారు సూచిస్తారు.
Beautiful Face : ముఖంపై మచ్చలు తొలగించి అందంగా మార్చే అలోవేరా జెల్, పాలు, తేనె మిశ్రమం!
మీ చర్మాన్ని ఎండ వేడి నుంచి రక్షించుకోండి. ప్రతిరోజు సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల UV కిరణాల నుంచి రక్షణ పొందవచ్చును. సన్ డ్యామేజ్ వల్ల చర్మం రంగు మారే ప్రమాదం ఉంటుంది. కొంతమంది పెళ్లికి కొన్ని రోజులు ముందు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. కొత్త ఉత్పత్తులను వాడుతుంటారు. అవి ఈవెంట్ ముందు ఊహించని విధంగా రియాక్షన్స్ ఇస్తుంటాయి. పెళ్లికి ముందు నిద్రను నిర్లక్ష్యం చేయకండి. అలా చేస్తే చర్మం అలసిపోయినట్లు కనిపిస్తుంది. నిద్ర కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ పెట్టుకోండి. పెళ్లి అనగానే సంతోషంతో పాటు లోపల తెలియని ఆందోళన ఉంటుంది. అయితే ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు. యోగా, ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మీ చర్మ సంరక్షణ మీ జీవితంలో ప్రత్యేకమైన రోజున మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.