Beautiful Face : ముఖంపై మచ్చలు తొలగించి అందంగా మార్చే అలోవేరా జెల్, పాలు, తేనె మిశ్రమం!

మార్కెట్లో లభించే క్రీములు వాడినా వాటి వల్ల ప్రయోజనం అంతంతమాత్రమే. అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని చాలా మంది అనుకుంటుంటారు. సాధారణంగా కొందరి ముఖం ఉదయానికి చాలా డల్ గా కనిపిస్తుంటుంది.

Beautiful Face : ముఖంపై మచ్చలు తొలగించి అందంగా మార్చే అలోవేరా జెల్, పాలు, తేనె మిశ్రమం!

Beautiful Face :

Beautiful Face : ముఖంపై నల్లటి మచ్చలు ముఖాన్ని అందంగా కనిపించకుండా అడ్డుకుంటాయి. మార్కెట్లో లభించే క్రీములు వాడినా వాటి వల్ల ప్రయోజనం అంతంతమాత్రమే. అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని చాలా మంది అనుకుంటుంటారు. సాధారణంగా కొందరి ముఖం ఉదయానికి చాలా డల్ గా కనిపిస్తుంటుంది. ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం, వాటర్ ను సరిగ్గా తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల ముఖంలో నిగారింపు కోల్పోతారు. అయితే ముఖాన్ని అందంగా మార్చుకోవటానికి కొన్ని చిట్కాలు బాగా తోడ్పడతాయి. అలాంటి వాటితో అలోవేరా ను ఉపయోగించి ఇలా చేస్తే ముఖం కాంతి వంతంగా మారి మచ్చలు తొలగిపోతాయి.

ముఖంపై మచ్చలు తొలగించి అందంగా మార్చే అలోవేరా మిశ్రమం ;

ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను వేసుకోవాలి. అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకుని పడుకోవాలి. ఇలా నైట్ నిద్రించే ముందు చేస్తే డల్ స్కిన్ కు దూరంగా ఉండొచ్చు. ఈ చిట్కా వల్ల ముఖం అందంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.  చర్మంపై ఏమైనా మచ్చలు ఉంటే తొలగిపోతాయి.

అలాగే ఒక బౌల్‌ తీసుకుని అందులో ఒక కప్పు పాలను పోయాలి. ఆ పాలలో కొద్దిగా వట్టివేరును వేసి మూత పెట్టి కనీసం నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి. అనంతరం పాలను ఫిల్టర్ చేసుకుని స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి. నైట్ నిద్రించే ముందు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని అనంతరం ఈ పాలను ముఖానికి స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే ఉదయానికి ముఖం కాంతివంతంగా మారుతుంది.