Master Dating : సోషల్ మీడియాలో వైరలవుతున్న మాస్టర్ డేటింగ్.. వాట్ ఈజ్ ద స్టోరీ?

మాస్టర్ డేటింగ్ అట.. కొత్త సంప్రదాయం మొదలైంది. సోలో బతుకే సో బెటర్ అంటున్నారు జనాలు. ఒంటరితనంలోనే నిజమైన హాయి ఉందంటున్నారు. అసలు ఈ కొత్త ట్రెండ్ ఏంటి?

Master Dating

Master Dating: ఒకప్పుడు ఒంటరితనం అంటే .. ఊహకే భయంగా ఉండేది. జీవితంలో ఒకరి తోడు లేకపోతే ఎలా ముందుకు సాగేది అని ఆలోచించేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కొత్త సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. మాస్టర్ డేటింగ్ అనే కొత్త ట్రెండ్‌తో సింగిల్‌గా ఉండటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అసలు ఈ ట్రెండ్ ఏంటి?

Mother Dating offer : 100 మందితో డేటింగ్ చేస్తే రూ.40లక్షలు ఇస్తానంటు కూతురికి తల్లి ఆఫర్

ఇప్పుడు చాలామంది సోలో బతుకే సో బెటర్ అంటున్నారు. సోలో డేటింగ్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు సోలో డేటింగ్ ఏంటి? ఒంటరి ప్రయాణం. మీకు మీరుగా ఉండటమే. ప్రతీదీ ఒంటరిగా ఉంటూ ఆస్వాదించడమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ స్వేచ్చగా, స్వంతంత్రంగా జీవించడమే. ఈ కొత్త ట్రెండ్ గురించి టిక్‌టాక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో స్వంత కంపెనీని ఎలా ప్రేమించుకోవచ్చనే వీడియోలను తెగ పోస్ట్ చేస్తున్నారు. సోలో డేటింగ్‌లో ఉండేవారు రెస్టారెంట్, బార్, మ్యూజియం, పార్క్‌లలో ఒంటరిగా సమయం గడపుతారు. తమకు నచ్చినవి కొనుక్కుంటారు. తమకు తామే ట్రీట్‌లు ఇచ్చుకుంటారు. నచ్చిన విహార యాత్రలకు వెళ్తారు.

Raashii Khanna : రాశీఖన్నాకు బ్రేకప్ అయిందా? బ్రేకప్ వల్ల బరువు పెరిగా.. డేటింగ్ వల్ల బరువు తగ్గా.. రాశీఖన్నా వ్యాఖ్యలు..

తమకోసం మాత్రమే ఆలోచించుకుంటూ.. తమ కోసం సమయాన్ని కేటాయించుకుంటూ.. తమ స్వంత కంపెనీని ఆస్వాదించడమే సోలో డేటింగ్ ముఖ్య ఉద్దేశ్యమట. డేటింగ్ నిపుణుడు మెలిస్సా స్టోన్ ఈ విషయాన్ని చెబుతున్నారు. సంతోషం ఇచ్చే పనులు చేయడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం వంటికి కూడా ఇందులోకే వస్తాయట. వారంలో ఒకసారైనా మాస్టర్ డేటింగ్ చేయాలట. మాస్టర్ డేటింగ్ (MasterDating) అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ అంశంపై ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.