Stone Fruits : రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసే స్టోన్ ఫ్రూట్స్!
స్టోన్ ఫ్రూట్స్ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ వంటివి కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఫలితంగా క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు.

Stone fruits that increase immunity and make blood circulation smooth!
Stone Fruits : పీచెస్, చెర్రీస్, ఆప్రికాట్స్, ప్లమ్స్ మరియు మామిడి వంటి అనేక రకాల స్టోన్ ఫ్రూట్స్ ఉన్నాయి. స్టోన్ ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్, విటమిన్స్ ఎ, సి, ఇ మరియు మినరల్స్ తో నిండి ఉంటాయి. ఈ పండ్లు పక్వానికి చాలా సమయం పడుతుంది. మంచి వాసనతో పాటు పోషకాలను కలిగి ఉంటాయి. నిజానికి, ఈ పండ్ల వాసన పక్వానికి సూచిక. ఇలాంటి పండ్లను తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనలు చేకూరుతాయి.
సీజన్ల వారీగా అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అయితే వీటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే సి విటమిన్ అధికంగా ఉండే స్టోన్ ఫ్రూట్స్ అందుకు చక్కటి ప్రత్యామ్నాయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉండే ఈ పండ్లు ఫ్రీరాడికల్స్ నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అలాగే తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పీచ్, ప్లమ్ వంటి పండ్లలో పొటాషియం స్థాయులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి బీపీని అదుపు చేస్తాయి. తద్వారా అలసట, నీరసం.. వంటివి దూరమవుతాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు తీసుకునే మందుల కారణంగా అప్పుడప్పుడూ అలసట, నీరసం వేధించడం సహజమే అయితే వీటి నుంచి విముక్తి పొంది నరాలు, కండరాలు రిలాక్స్ కావాలంటే స్టోన్స్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.
స్టోన్ ఫ్రూట్స్ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ వంటివి కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఫలితంగా క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే స్టోన్ ప్రూట్స్ ని ఆహారంలో చేర్చుకోవటం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. స్టోన్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని సహజంగా పెంచుతుంది. ఇది చర్మం మరియు జుట్టును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఆప్రికాట్లు, రేగు పండ్లు వంటి స్టోన్ ఫ్రూట్స్ మరియు వాటి పదార్దాలు చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. స్టోన్ ఫ్రూట్స్‌తో చేసిన స్మూతీస్, షేక్స్ లేదా సలాడ్‌లను తయారు చేయడం వల్ల సహజంగా అధిక రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది.