Super Food Combos : శరీరానికి మంచి పోషకాలు అందాలంటే ఈ సూపర్ ఫుడ్ కాంబోలు కలిపి తీసుకోండి !

పోషకాహారం విషయానికొస్తే తీసుకునే భోజనం సమయానుకూలంగా ఉండటమే కాకుండా, సమతుల్య ఆహారమై, సరైన పోషక మిశ్రమాన్ని కలిగి ఉండాలి. భోజనం చేయటంలో ఏమాత్రం ఆలస్యమైనా ఆ ప్రభావం శరీర పనితీరుపై పడుతుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ వంటివి సరైన పోషకాల కలయికతో ప్లాన్ చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Super Food Combos

Super Food Combos : పోషకాహారం ఆరోగ్యానికి పునాది వంటిది. వివిధ మార్గాల్లో శరీరానికి ఇంధనాన్ని అందించగలిగేది సరైన పోషకాల మిశ్రమం మాత్రమే. రోజువారి దినచర్యలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత ఉరుకులుపరుగుల జీవితంలో అల్పాహారాన్ని చాలా మంది కుకీలు లేదా శాండ్‌విచ్ ,మల్టీవిటమిన్ టాబ్లెట్‌తో భర్తీ చేస్తున్నారు. ఒత్తిడితో కూడిన జీవితంలో వ్యాయామానికి సరైన సమయం కేటాయించలేని పరిస్ధితి.

READ ALSO : Hair Fall Problem : జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? నివారించాలంటే సరైన పోషకాహారం తీసుకోవటమే ఉత్తమ మార్గమా?

పోషకాహారం విషయానికొస్తే తీసుకునే భోజనం సమయానుకూలంగా ఉండటమే కాకుండా, సమతుల్య ఆహారమై, సరైన పోషక మిశ్రమాన్ని కలిగి ఉండాలి. భోజనం చేయటంలో ఏమాత్రం ఆలస్యమైనా ఆ ప్రభావం శరీర పనితీరుపై పడుతుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ వంటివి సరైన పోషకాల కలయికతో ప్లాన్ చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనం తీసుకునే ఆహారానికి చిన్నపాటి మార్పులు, చేర్పులు చేసుకుంటే దీర్ఘకాల ఆరోగ్యానికి తోడ్పడడంలో దోహదపడతాయి.

ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహార కలయికలు ;

1. గ్రీన్ టీ – నిమ్మకాయలు ;

గ్రీన్ టీలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్ల ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తాయి. చాలా మంది అందుకే తమ ఉదయం దినచర్యను గ్రీన్ టీతో ప్రారంభిస్తారు. గ్రీన్ టీ మెదడు పనితీరుకు తోడ్పడుతుందని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని, క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, కొన్ని చుక్కల నిమ్మరసం జోడించడం వల్ల గ్రీన్ టీ యొక్క యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

READ ALSO : Spirulina : ఈ ఆకుల పొడి తింటే పోషకాహారంతో పనిలేదు!

గ్రీన్ టీలో క్యాటెచిన్స్ & ఎపికాటెచిన్స్‌తో సహా ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఈ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్ & యాంటీ ఇన్‌ఫ్లమేటరీ రక్షణను అందిస్తాయి. గ్రీన్ టీలో రక్షిత యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం 5-10 రెట్లు పెరుగుతుందని పరిశోధనలో తేలింది. దీని ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఉదయాన్నే లేదా సాయంత్రం ఈ దీన్ని తీసుకోవాలి.

2. వాల్నట్ – బ్లూబెర్రీస్ ;

మెదడు ఆలోచించడం, గుర్తుంచుకోవడం, వ్యూహరచన చేయడం, నేర్చుకోవడం వంటి అనేక ఇతర విధులను నిర్వర్తిస్తుంది. మెదడు సమర్థవంతమైన పనితీరు కోసం సరైన మోతాదులో పోషకాలను అందించడం చాలా ముఖ్యం. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో మంచి వాల్‌నట్‌లు , బ్లూబెర్రీస్ అనే రెండు సూపర్‌ఫుడ్‌లను కలపడం మంచిది. కాబట్టి మెదడుకు అదనపు పోషకాహారాన్ని అందించాలనుకుంటే, బ్లూబెర్రీస్‌తో కొన్ని వాల్‌నట్‌లను కలిపి తినటానికి ప్రయత్నించండి.

READ ALSO : Prevent Cough and Cold : వర్షాకాలంలో దగ్గు, జలుబును ఎలా నివారించాలి ?

వాల్‌నట్స్‌లో అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మరియు పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ రెండూ ఆక్సీకరణ ఒత్తిడిని , వాపును ఎదుర్కొంటాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బ్లూబెర్రీస్ మెదడులోని కీలక ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే శ్రద్ధ , జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. వాల్‌నట్‌లు, బ్లూబెర్రీస్ జ్ఞాపకశక్తి ఆరోగ్యానికి పవర్‌హౌస్ అని నిపుణులు చెబుతున్నారు.

3. నల్ల మిరియాలు – పసుపు :

కూరలో నల్ల మిరియాపొడి వేసుకోవటం వల్ల దాని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణశక్తిని పెంచుతాయి. పసుపు , నల్ల మిరియాలు కలపటం వల్ల శక్తివంతమైన ప్రభావం ఉంటుంది. ఉదయం పోహా నుండి డిన్నర్ కర్రీ వరకు శక్తివంతమైన కలయికను ఆస్వాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

READ ALSO : పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషకాహారం..

నల్ల మిరియాలు పైపెరిన్, పసుపులో కర్కుమిన్ ఉంటుంది. పైపెరిన్ కర్కుమిన్ కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు