Hair Fall Problem : జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? నివారించాలంటే సరైన పోషకాహారం తీసుకోవటమే ఉత్తమ మార్గమా?

విటమిన్ సి లోపం వల జుట్టు రాలిపోతుంది. విటమిన్ సి జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. అంతే కాకుండా విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ని పొందటం కోసం నిమ్మ ,నారింజ వంటి పళ్ళు , ఉసిరికాయ , టమాటో , పొటాటో , ఆకుకూరలు రోజువారిగా ఆహారంలో చేర్చుకోవాలి.

Hair Fall Problem : జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? నివారించాలంటే సరైన పోషకాహారం తీసుకోవటమే ఉత్తమ మార్గమా?

hair fall problem?

Hair Fall Problem : సరైన పోషకాహారం తీసుకోకపోతే అనేక నష్టాలు కలుగుతాయి. అందులో హెయిర్ ఫాల్ ఒకటి. పోషకాహార లోపం వలన జుట్టు కి అందవలసిన పోషకాలు అందక జుట్టు బలహీనంగామారిపోయి ఊడిపోతుంది. సరైన పోషక ఆహారం తీసుకోవటం ద్వారా మన జుత్తు రాలకుండా, ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. మన శరీరం లో వేగంగా అభివృద్ధి చెందే కణాలలో మన జుట్టు కణాలు ఒకటి. జుట్టుకు సరైన మోతాదులో పోషకాలు అందకపొతే అవి బలహీనంగా మారతాయి.

జుట్టు కి కావలసిన ప్రధాన పోషకాలు ఐరన్ ,విటమిన్ బి 7,విటమిన్ బి 12,విటమిన్ C ,విటమిన్ డి , జింక్ మొదలగునవి. ఈ పోషకాలు ప్రతి రోజు మనం తినే ఆహరం లో ఉండేలా చూసుకోవటం అవసరం. వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. విటమిన్ బి 7 ; జుట్టుకు కావాల్సిన విటమిన్ లలో ఇది ముఖ్యమైనది. బి విటమిన్స్ ని బయోటిన్ అని అంటారు. బయోటిన్ హెయిర్ పెరుగుటకు చాల అవసరం. ఇది ఎర్ర రక్త కణాలు తయారీకి ఉపయోగ పడుతుంది. ఇది ఎర్ర రక్త కణాలుని మరియు పోషకాలుని జుట్టు కుదుళ్లకు అందిస్తుంది. తృణ ధాన్యాలు , బాదం, మటన్ , ఫిష్ , పెరుగు , స్వీట్ పొటాటోవంటి వాటి ద్వారా ఇది లభిస్తుంది.

2. విటమిన్ డి ; జుట్టు యొక్క పెరుగుదల కు విటమిన్ డి తోడ్పడుతుంది. విటమిన్ డి మనకు సూర్య కాంతి నుండి లభిస్తుంది. చాల మందికి విటమిన్ డి లోపం వలన కూడా జుట్టు ఊడిపోతుంది. పాలు , పుట్టగొడుగు , ఫిష్ , సూర్య రశ్మి వంటి వాటి ద్వారా విటమిన్ డిని పొందవచ్చు.

3. జింక్ మన కుదుళ్ళు పెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. జుట్టు రాలటం లో జింక్ లోపం అనేది ఒక ముఖ్య కారణం. జింక్ సరైన మోతాదులో తీసుకోవాలి. గుమ్మడి గింజలు , మటన్ , గుడ్లు , ఫిష్ , తృణ ధాన్యాలు , కూరగాయలు వంటి వాటి ద్వారా జింక్ ను పొందవచ్చు.

4. డై హైడ్రో టెస్టోస్టీరాన్ ; ఇది టెస్టోస్టీరాన్ హార్మోన్ వలన ఉత్పత్తి అవుతుంది. డిహెచ్ టి హార్మోన్ ఎక్కువ అవటం వలన జుత్తు కుదుళ్ళు బలహీనం గా మారీ రాలటం మొదలవుతుంది. ఈ పరిస్ధితిని నిరోధించేందుకు కొన్ని రకాల ఆహార పదార్దాలు బాగా ఉపకరిస్తాయి. వాటిలో గ్రీన్ టీ , టమాటో , పొటాటో , కొబ్బరి నూనె , ఉల్లి , చిక్కుడు వంటి ఆహారాలు తీసుకోవాలి.

5. విటమిన్ సి ; విటమిన్ సి లోపం వల జుట్టు రాలిపోతుంది. విటమిన్ సి జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. అంతే కాకుండా విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ని పొందటం కోసం నిమ్మ ,నారింజ వంటి పళ్ళు , ఉసిరికాయ , టమాటో , పొటాటో , ఆకుకూరలు రోజువారిగా ఆహారంలో చేర్చుకోవాలి.

6. ఐరన్ ; ఎర్ర రక్త కణాలుని కుదుళ్ళకి అందించడంలో ఐరన్ తోడ్పడుతుంది. జుట్టు పెరుగు దలలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరం లో అనేక విధులుని నిర్వర్ష్టిస్తుంది. ఐరన్ లోపం వలన రక్త హీనత కలుగుతుంది. హెయిర్ లాస్ కు రక్త హీనత కూడా కారణం అవుతుంది. ఐరన్ కోసం ఆకుకూరలు , బాదం , జీడీ పప్పు ,ఎండు ద్రాక్ష , దానిమ్మ , పన్నీర్
చిక్కుడు వంటివి తీసుకోవాలి.

ఈ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమేగాక మన జుట్టు రాలటం తగ్గి కొత్త జుట్టు తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.