Foot shape tells personality : మీ పాదం షేప్.. మీ వ్యక్తిత్వం చెప్పేస్తుంది.. మీరు..మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చెక్ చేసుకోండి
అరచేతుల్లో గీతలు, చేతి వేలి పొడవులను బట్టి మనిషి మనస్తత్వాన్ని చెబుతుంటారు. అలాగే కాలి వేళ్లు, వాటి షేప్‌ని బట్టి కూడా వ్యక్తిత్వాన్ని చెబుతారు. మీ పాదాల షేప్, మీ వ్యక్తిత్వం ఓసారి చెక్ చేసుకోండి.

Foot shape tells personality
Foot shape tells personality : అరచేతుల్లో రేఖలు చూసి జాతకం చెబుతూ ఉంటారు. అలాగే చేతి వేళ్లు పొడవును బట్టి కూడా మనుష్యుల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అలాగే పాదాల వేళ్లు, ఆకృతిని బట్టి కూడా వారి మనస్తత్వాన్ని చెబుతారు. పర్సనాలిటీ సైకాలజీ తాజా పరిశోధనల్లో పాదాల రకాలు.. వాటిని బట్టి మనుష్యుల మనస్తత్వం చెబుతున్నారు. ఎవరి గురించో కాకపోయినా మీగురించి మీకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కదా.. మీ పాదాల షేప్‌ని బట్టి మీ బలాలు, బలహీనతలు, స్వభావం, మనస్తత్వం, ప్రవర్తన తెలుసుకోవాలంటే ఓ లుక్ వేయండి.
కూర్చొనే భంగిమను బట్టి వ్యక్తిత్వం
మీ కాలు బొటనవేలు, రెండవ వేలు, మూడవ వేలు సమాన ఎత్తులో ఉండి నాల్గవ, మరియు ఐదవ వేళ్లు పొడవు తక్కువగా ఉంటే దానిని రోమన్ పాదం (Roman Foot Shape) అంటారు. ఇలాంటి పాదం షేప్ ఉన్నవాళ్లు అందరితో స్నేహంగా ఉంటారు. కొత్త వ్యక్తుల్ని కలవడానికి ఇష్టపడుతుంటారు. తమ మీద తాము నమ్మకంగా ఉంటారు. స్ట్రాంగ్‌గా ఉంటారు. లీడర్ షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అందరితో ప్రశంసలు పొందుతారు. ఏ పని చేసినా అందులో ప్రత్యేకత ఉంటుంది. ఇతరులను చూసి ఏది కాపీ చేయరు. తమ అభిప్రాయాల్ని ఇతరుల ముందు చెప్పరు. బాధ్యతలు తీసుకోవడానికి అస్సలు భయపడరు. ఇష్టమైన వారికి నచ్చే పని చేయడం కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. సోషల్ మీడియాలో అందర్నీ ఆకర్షిస్తూ ధైర్యంగా ఉంటారు. కొత్త కళలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి కనబరుస్తారు.
బొటనవేలు నుంచి చిటికెన వేలు వరకూ అన్ని వేళ్లు సమానంగా.. ఒకే ఎత్తులో ఉంటే దానిని చతురస్రాకారపు పాదం (Square Foot Shape) అంటారు. ఈ షేప్‌లో పాదం ఉన్నవారు డౌన్ టూ ఎర్త్ ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. సమస్యలు ఎదురైతే వాటి పరిష్కారాన్ని సులువుగా కనిపెడతారు. నమ్మదగినవారు. మాటను నిలబెట్టుకోవడంలో ముందుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. సింపుల్‌గా ఉంటారు. ఎన్ని విజయాలు సాధించినా గొప్పలు చెప్పుకోరు. లక్ష్యాలను సాధించడంలో చాలా పట్టుదలగా, సహనంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడి అయినా ఎదుర్కుంటూ భావోద్వేగాలను ప్రదర్శించకుండా ముందుకు సాగిపోతారు. ఇంజనీరింగ్, అకౌంటెన్సీ, టీచింగ్, లా, బ్యాంకింగ్ సంబంధించిన కెరియర్లపై ఆసక్తి చూపుతారు.
TROLLING : ఎలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ట్రోల్స్ చేస్తారో మీకు తెలుసా?
బొటనవేలు పక్కన వేలు పొడవు ఉన్నవారి పాదాలను గ్రీకు పాదాలు (Greek Foot Shape) అంటారు. ఈ రకమైన పాదాల షేప్ ఉన్నవారు చాలా క్రియేటివ్‌గా ఉంటారు. సాహసాలు చేస్తారు. కొత్త ఆలోచనలు చేయడంలో ముందుంటారు. కొత్త సవాళ్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎప్పుడూ కొత్త మార్గాల కోసం అన్వేషణ చేస్తుంటారు. ఇతరులకు ప్రేరణగా ఉంటారు. సొంత మార్గంలో ప్రయాణం చేస్తారు. రిస్క్ తీసుకోవడానికి అస్సలు భయపడరు. ఎదుటివారి పట్ల దయ, సానుభూతి ప్రదర్శిస్తారు.
బొటనవేలు పొడవుగా ఉండి కింది నాలుగు వేళ్లు 45 డిగ్రీల కోణంలో ఉంటే అలాంటి పాదాల షేప్‌ను ఈజిప్షియన్ ఫుట్ షేప్ (Egyptian Foot Shape) అంటారు. ఇలాంటి ఆకారంలో ఉంటే స్వతంత్రంగా, స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారు. స్వంత నిర్ణయాలు తీసుకుంటారు. నైపుణ్యంతో ఎదుటివారిని ఏదైనా ఒప్పించగలుగుతారు. మొండి పట్టుదల, వీరి మనస్తత్వాన్ని బట్టి వీరిని ఏదైనా ఒప్పించడం చాలా కష్టం. ఎప్పుడూ విజయం కోసం అలుపెరగక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వ్యక్తిగత విషయాలను ఇతరులకు పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. చూసారుగా.. ఇక మీ పాదాల షేప్‌ని బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోండి.. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సరదాగా ఈ అంశాల్ని చర్చించుకోండి.