peanuts
Benefits of Peanuts : పనిలేకుండా ఖాళీగా ఉన్న సమయంలో టైం పాస్ కోసం చాలా మంది రుచికరమైన వేరుశనగ గింజలను తినడానికి ఇష్టపడతారు. వేరుశనగ గింజల్లో సహజ సిద్ధంగా అనేక పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేరుశనగ గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ,B విటమిన్లు , విటమిన్ E వంటి ఖనిజాలు ఉంటాయి. రోజూ వేరుశెనగ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు కలగటమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేరుశెనగకాయలు చాలా చోట్లు దొరుకుతాయి.
READ ALSO : Gastric problems : గ్యాస్ట్రిక్ సమస్యలు కారణాలు, చికిత్స !
వేరుశెనగ గింజల వల్ల కలిగే 5 ప్రయోజనాలు ;
కంటి చూపును మెరుగుపరచటానికి ;
కళ్ళు బలహీనంగా మారకుండా ఉండాలంటే వేరుశెనగ గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిది. ఇందులో ఉండే జింక్ శరీరం విటమిన్ ఎను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రేచీకటి రాకుండా చేయటంలో సహాయపడుతుంది.
READ ALSO : Effects of Smoking : చర్మం, జుట్టు , కంటి ఆరోగ్యంపై ధూమపానం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?
ఎముకలను దృఢంగా మారాలంటే ;
ఎముకలను బలోపేతం చేయాలనుకుంటే, వేరుశెనగ గింజలను తీసుకోవాలి. వీటిలో మాంగనీస్ మరియు ఫాస్పరస్ సమృద్ధిగా ఉండటం వల్ల, వేరుశెనగ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
READ ALSO : Chicken liver : ఎముకలు, కండరాలకు మేలు చేసే…. చికెన్ లివర్
శాఖాహారం ప్రోటీన్ కు మంచి మూలం ;
శాఖాహారులు ప్రోటీన్ పొందాలనుకుంటే వేరుశనగ గింజలు మంచి ఎంపిక. ఒక పిడికెడు వేరుశెనగలో 7.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ;
వేరుశెనగలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేరుశెనగ తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
READ ALSO : Protect Heart Health : మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !
డిప్రెషన్‌ను తగ్గించడంలో ;
ఇటీవలి కాలంలో మానసిక సమస్యలకు గురవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వేరుశెనగ తినడం వల్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది డిప్రెషన్‌ను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.