Chicken liver : ఎముకలు, కండరాలకు మేలు చేసే…. చికెన్ లివర్
చికెన్ లివర్ డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంతో పాటు బ్రెయిన్ డెవలప్‌మెంట్, కంటిచూపు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. గుండె జబ్బులపై పోరాడే సెలీనియం అనే మినరల్ ఈ చికెన్ లివర్‌లో ఉంటుంది.

Chicken Liver
Chicken liver : విటమిన్స్, మినరల్స్‌తో కూడిన చికెన్ లివర్‌ను తినడం వల్ల శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మేక లివర్ తో పోల్చి చూస్తే చికెన్ లివర్ మంచి న్యూట్రిషినల్ ఫుడ్ గా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మాంసప్రియుల్లో చాలా మంది లివర్ తినేందుకు పెద్దగా ఇష్టపడరు. వాస్తవానికి చికెన్ లివర్ లో విటమిన్ ఎ, విటమిన్ బి, ఐరన్, కాల్షియమ్, ఫొలేట్, ప్రొటీన్, విటమిన్ బి 12 వంటి పోషకాలు లభిస్తాయి.
చికెన్ లివర్‌లోని సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, ఇన్ఫెక్షన్లు, కీళ్ల నొప్పులు, నులిపురుగుల సమస్యలను రాకుండా చూడటంలో బాగా ఉపకరిస్తుంది. చికెన్ లివర్‌లో ప్రొటీన్ బాగానే ఉంటుంది. అయితే చికెన్ లివర్‌ను బాగా ఫ్రై చేయకుండా మామూలుగా ఉడికించి తింటే కేలరీస్ తక్కువగా ఉంటాయి. బరువు పెరుగేందుకు అవకాశం ఉండదు. చికెన్ లివర్‌లో ఉండే ఐరన్, ఇతర పోషకాలు విటమిన్ బి 12 లోపం లేకుండా కాపాడుతాయి. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఆక్సిజన్ మోసుకెళ్లేందుకు ఐరన్, ఇతర పోషకాలు అవసరం. రక్తం ఆరోగ్యంగా ఉంచటమే కాక మెదడు చురుగ్గా పనిచేసేందుకు చికెన్ లివర్‌లో దొరికే బి 12 దోహదం చేస్తుంది.
చికెన్ లివర్ డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంతో పాటు బ్రెయిన్ డెవలప్‌మెంట్, కంటిచూపు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. గుండె జబ్బులపై పోరాడే సెలీనియం అనే మినరల్ ఈ చికెన్ లివర్‌లో ఉంటుంది. అధిక కొలెస్టరాల్ స్థాయిలను కూడా ఇది అదుపు చేస్తుంది. కాలేయంలోని ఫోలేట్ అనే పదార్థం లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అడ్రినలిన్ హార్మోన్ స్రవాన్ని పెంచుతుంది. ఎముక, కండరాల నిర్మాణాన్ని బలపరుస్తుంది. శరీరంలోని వివిధ పోషకాహార లోప సమస్యలను అధిగమించేందుకు, వేగంగా బరువు పెరగేందుకు సాయపడుతుంది. చికెన్ లివర్‌లో ఉండే విటమిన్ ఏ కంటి చూపును కాపాడుతుంది.
చికెన్ లివర్‌లో విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలు చికెన్ లివర్ తినకపోవడం మంచిది.