Calcium Rich Fruits : ఎముకల బలాన్ని పెంచి, వ్యాధులను దూరం చేసే కాల్షియం… ఇది అధికంగా ఉండే 5 రకాల పండ్లు ఇవే !
నారింజలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నారింజలో 40 mg కాల్షియం ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది, ఇది కాల్షియం శోషణను పెంచుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Calcium Rich Fruits
Calcium Rich Fruits : క్యాల్షియం లోపం వల్ల శరీరంలోని ఎముకలు బలహీనంగా మారి క్షీణించిపోతాయి. అంతేకాకుండా కీళ్ళనొప్పులు , ఆస్టియోపోరోసిస్ బాధితులుగా మారిపోతారు. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. నెమ్మదిగా అనేక వ్యాధుల బారిన పడతారు. ఈ పరిస్థితిలో ఎముకలకు వివిధ మార్గాల్లో మేలు చేసే కాల్షియం సమృద్ధిగా ఉన్న పండ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO : ఈ ఆహారంతో పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్
కాల్షియం అధికంగా ఉండే పండ్లు ;
1. నారింజ ; నారింజలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నారింజలో 40 mg కాల్షియం ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది, ఇది కాల్షియం శోషణను పెంచుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
2. కివి ; 100 గ్రాముల కివిలో 34 mg కాల్షియం ఉంది. అంటే రోజూ 2 కివీస్ తింటే మంచి కాల్షియం అందుతుంది. దీంతో ఎముకల సాంద్రత పెరిగి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనితో పాటు, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది.
READ ALSO : Calcium Is Essential : ఎముకల గట్టితనానికే కాదు, గుండె ఆరోగ్యానికి కాల్షియం అవసరమే!
3. నేరేడు పండు ; నేరేడు పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. నేరేడు పండ్లు ఎముకలను ఆరోగ్యకరంగా ఉంచటమే కాకుండా, శరీరానికి ఐరన్ మరియు మెగ్నీషియం కూడా అందేలా చేస్తాయి.
4. బొప్పాయి ; బొప్పాయి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కడుపు, చర్మంతో పాటు అనేక సమస్యలను తొలగిస్తుంది. శరీరానికి కావాల్సిన కాల్షియాన్ని అందిస్తుంది.
READ ALSO : Calcium : రోజుకు వయస్సుల వారిగా ఎవరికెంత కాల్షియం శరీరానికి అవసరమంటే?
5. స్ట్రాబెర్రీ ; స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి , కాల్షియం పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో దాదాపు 27 mg కాల్షియం ఉంటుంది,
రోజవారిగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని తొలగించవచ్చు. ఎటువంటి సమస్య లేకుండాఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవచ్చు.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈసమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.