Lower Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే రోజువారీ పానీయాలు ఇవే ?

కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఈ సహజ పానీయం మూత్రపిండాలు శరీరం నుండి అధిక సోడియం స్థాయిలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడానికి ఇది అవసరమౌతుంది.

Lower Blood Pressure : ప్రస్తుత కాలంలో రక్తపోటు అనేది యువత, వృద్ధులలో పెరుగుతున్న పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి ప్రాణాంతకమైన రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులతో సహా అనేక ఇతర ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతాయి. పూర్వకాలంలో జీవించిన మన పెద్దలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న వారు చురుకైన జీవితాన్ని గడపలేకపోవటానికి ఉప్పు, చక్కెర , ట్రాన్స్ ఫ్యాట్‌లు అధికంగా ఉండే అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవటమే.

READ ALSO : Sugar Free Sweeteners : బరువు తగ్గడానికి చక్కెర లేని స్వీటెనర్లను ఉపయోగించకూడదా ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ?

జంక్ ఫుడ్ లను తీసుకోవటం అధికం కావటం, సమయానికి ఆహారం తినకపోవటం కూడా దీనికి కారణం కావచ్చు. రక్తపోటును నియంత్రించడంలో ఆహారంలో మార్పులు చేయటం అన్నది తొలి అడుగుగా చెప్పవచ్చు. దీనికి రోజువారి వ్యాయామాలు జోడించడం వల్ల మరింత మేలు కలుగుతుంది. ఎందుకంటే ఇలా చేయటం వల్ల బరువు తగ్గడంతోపాటు రక్తపోటు లక్షణాలను తగ్గించుకోవచ్చు.

సమతుల్యమైన ఆహారం తీసుకోవటం అన్నది రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది. సమతుల్య ఆహరంలో పోషకాలు ఎక్కువ, సోడియం తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హైపర్‌టెన్షన్‌ రాకుండా ఆపడానికి ఆహార విధానాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. మనం తీసుకునే మొత్తం ఆహారాల్లో లీన్ ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు , తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవటం ద్వారా రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

READ ALSO : World Hypertension Day : హైపర్‌టెన్షన్‌పై అవగాహన తప్పనిసరంటున్న నిపుణులు… ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం మే 17 ప్రాముఖ్యత ఇదే ?

రక్తపోటును తగ్గించడానికి ఆహారంలో మార్పులు చేసుకోవటం ప్రధానమైనదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, సంతృప్త కొవ్వును తగ్గించడం, ఉప్పు తీసుకోవడం తగ్గించడం వంటి వాటితో కూడిన ఆహారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆల్కహాల్ వినియోగం, పొటాషియం తీసుకోవడం పెంచడం, మెగ్నీషియం, కాల్షియం బీపీ ని తగ్గించడంలో సహాయపడే మూడు ముఖ్యమైన పోషకాలు. మెగ్నీషియం రక్త నాళాలు సడలింపునివ్వటంలో సహాయపడుతుంది. తద్వారా రక్తపోటును తగ్గిస్తుంది, ఇది కాల్షియం , పొటాషియం రవాణాలో కూడా తోడ్పడుతుంది. రక్త నాళాల సంకోచం, వ్యాకోచాల్లో పొటాషియం అధిక సోడియంను బయటకు పంపటంలో శరీరానికి సహాయం చేయడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది.

బిపిని తగ్గించడంలో సహాయపడే రోజువారీ పానీయాలు ;

1. కొబ్బరి నీరు ; కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఈ సహజ పానీయం మూత్రపిండాలు శరీరం నుండి అధిక సోడియం స్థాయిలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడానికి ఇది అవసరమౌతుంది. అలాగే, అధిక పొటాషియం స్థాయిలు శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాని సహాయపడతాయి, గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది.

READ ALSO : High Blood Pressure : అధిక రక్తపోటు సమస్యా? నిర్లక్ష్యం వద్దు!

2. బనానా మిల్క్ షేక్ ; అరటిపండు పొటాషియం యొక్క పవర్‌హౌస్ చెప్పవచ్చు. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. తక్కువ కొవ్వును కలిగిన స్కిమ్డ్ మిల్క్ తో బనానా మిల్క్ షేక్ తయారు చేసుకోవాలి. ఈ రుచికరమైన పానీయంలో పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఖనిజాలు.

3. టొమాటో సూప్ ; టొమాటోలు లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని అధ్యయనాల్లో తేలింది. టొమాటో రసం లేదా టొమాటో సూప్ రోజువారీ వినియోగం సిస్టోలిక్ , డయాస్టొలిక్ రక్తపోటుతోపాటు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

READ ALSO : Coriander : చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే కొత్తిమీర!

4. మజ్జిగ ; మజ్జిగ అనేది శరీరాన్ని చల్లబరిచే పానీయం. దీనిని రోజువారీ పానీయంగా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బిపిని తగ్గించడంలో తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు ఆహారంలో ప్రధాన భాగం చేసుకోవటం మంచిది.

5. దానిమ్మ, బీట్‌రూట్ రసం ; దానిమ్మలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని రక్తనాళాల పరిమాణాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ప్రోటీన్ అయిన యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE) స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. బీట్ రూట్ రసంలో నైట్రేట్ (NO3) ఉంటుంది, ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపడేందుకు దోహదపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు