Coriander : చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే కొత్తిమీర!

కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Coriander : చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే కొత్తిమీర!

Health Benefits of Coriander Leaves & Seeds

Coriander :  కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నా, శరీరానికి అవసరమైన శక్తి కంటే ఎక్కువ ఆహారం తీసుకున్నా రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరుగుతాయి. జంక్‌ ఫుడ్, ప్యాకెట్‌ ఫుడ్‌, మాంసం, ఛీజ్‌, వెన్న, ఐస్‌క్రీమ్‌లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్ పెరగటానికి ముఖ్యకారణంగా నిపుణులు చెబుతున్నారు. పెరిగిన కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవటానికి సహజమైన పద్ధతుల ద్వారా ప్రయత్నించటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

కొలెస్ట్రాల్, రక్తపోటు ను తగ్గించే కొత్తి మీర ;

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కొత్తిమీరు సమర్థవంతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం కొత్తిమీరకు ఉంది. కొత్తిమీరను ఎక్కువగా తీసుకునే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.

కొత్తిమీరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-డైస్లిపిడెమిక్ , యాంటీ-హైపర్‌టెన్సివ్, న్యూరోప్రొటెక్టివ్ వంటి లక్షణాలు ఉన్నాయి. వీటిలో యాంటీ మైక్రోబియల్ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి మూలకాలు కొత్తిమీర ఆకులలో ఉంటాయి.

కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే పొటాషియంరక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొత్తిమీర తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు, ప్రేగు సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శరీరంలోని అనవసరమైన సోడియం మూత్రం ద్వారా బయటకు వెళ్లేలా చేయటంలో మంచి సహాయకారిగా కొత్తిమీర ఉపకరిస్తుంది.

ఆహారంలో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహులకు ఇది ఒక వరం లాంటిది. ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయ సంబంధిత సమస్యలకు కొత్తిమీర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులలో తగినంత ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.