Alzheimer’s Early Signs : అల్జిమర్స్ వచ్చే ముందు సంకేతాలు ఇవే !

అల్జీమర్స్ వల్ల జ్ఞాపకశక్తి మార్పుల కారణంగా వ్యక్తులు తరచుగా రోజువారీ పనులను పూర్తి చేయడం కష్టంగా మారుతుంది. తెలిసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది.

alzheimer's

Alzheimer’s Early Signs : రోజువారీ జీవితంలో జ్ఞాపకశక్తి కోల్పోవడాన్ని అల్జీమర్స్ , చిత్తవైకల్యం యొక్క లక్షణంగా చెప్పవచ్చు. అల్జీమర్స్ అనేది మెదడు సంబంధిత వ్యాధి, ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన , తార్కిక నైపుణ్యాలలో క్షీణతకు కారణమవుతుంది. అల్జీమర్స్ కు సంబంధించి ముందస్తుగా శరీరంలో సంకేతాలు , లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో దేనినైనా గమనించినట్లయితే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని వద్దకు వెళ్ళి తగిన చికిత్స పొందటం మంచిది.

READ ALSO : Tomato Cultivation : టమాటో సాగులో అధిక దిగుబడులకోసం సాగులో చేపట్టాల్సిన మెళకువులు

అల్జీమర్స్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ;

అల్జీమర్స్ వ్యాధి యొక్క అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి, ముఖ్యంగా ప్రారంభ దశలో, ఇటీవల తెలుసుకున్న సమాచారాన్ని మర్చిపోవడం. ముఖ్యమైన తేదీలు లేదా ఈవెంట్‌లను మరచిపోవడం, అదే ప్రశ్నలను పదే పదే అడగడం , కుటుంబ సభ్యులను అడిగి వాటిని గుర్తు చేసుకోవటం వంటి పరిస్ధితులు ఏర్పడతాయి. అల్జీమర్స్ కారణంగా జ్ఞాపకశక్తిలో మార్పులతో జీవిస్తున్న వ్యక్తులు తమ రోజువారి ప్రణాళికను అనుసరించడం వంటి వారి సామర్థ్యంలో మార్పులు చోటు చేసుకుంటాయి. నెలవారీ బిల్లులను కట్టటంలో సమస్య ఉండవచ్చు. ఏకాగ్రత లేకపోవటంతో ఏవిషయంపై దృష్టిసారించలేకపోతుంటారు.

READ ALSO : Reproductive Health : పురుషులు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వాస్తవాలు !

అల్జీమర్స్ వల్ల జ్ఞాపకశక్తి మార్పుల కారణంగా వ్యక్తులు తరచుగా రోజువారీ పనులను పూర్తి చేయడం కష్టంగా మారుతుంది. తెలిసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు వారు ఎక్కడకో వెళ్ళాల్సి ఉండగా మరెక్కడికో వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళటం, ఇంటి కిరాణా జాబితాను గుర్తుంచుకోలేకపోవటం, ఇష్టమైన గేమ్ నియమాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడటం వంటివి చోటు చేసుకుంటాయి.

సమయం, ప్రదేశంతో గందరగోళం నెలకొంటుంది. అల్జీమర్స్ వ్యక్తులు తేదీలు, రుతువులు , వివరాలను గుర్తుంచుకోవటం కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు వారు ఎక్కడ ఉన్నారో , ఎలా వచ్చారో మర్చిపోవచ్చు. దృశ్య చిత్రాలు , ప్రాదేశిక సంబంధాలను అర్థం చేసుకోవడంలో సమస్య తలెత్తుతుంది. రీడింగ్‌లో ఇబ్బందికి దారితీయవచ్చు. దూరాన్ని నిర్ధారించడంలో,రంగు లేదా కాంట్రాస్ట్‌ని నిర్ణయించడంలో సమస్యలను కలిగి ఉండవచ్చు, డ్రైవింగ్‌లో సమస్యలను కలిగిస్తుంది.

READ ALSO : Skin Diseases In Diabetics : మధుమేహ బాధితుల్లో చర్మ వ్యాధులను ప్రేరేపించే వర్షాకాలం.. చర్మ ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన విధానాలు !

మాట్లాడటం లేదా వ్రాయడంలో పదాలతో కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తులతో సంభాషించటంలో ఇబ్బంది పడవచ్చు. కొన్నిసార్లు సంభాషణ మధ్యలో ఆపివేయవచ్చు. తిరిగి ఎలా కొనసాగించాలో తెలియదు. తెలిసిన వస్తువు పేరు చెప్పటంలో ఇబ్బంది పడవచ్చు. తప్పు పేరు చెప్పటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏదో ప్రదేశంలో వస్తువులను ఉంచి తిరిగి వాటిని ఎక్కడ ఉంచామో మర్చిపోతుంటారు. వాటిని తిరిగి ఎక్కడ పెట్టామో వెతుకుతుంటారు. ఒక వేళ అవికనిపించకపోతే ఇతరులు దొంగిలించారని ఆరోపించవచ్చు. ప్రత్యేకించి ఇది వ్యాధి ముదిరిపోయినప్పుడు జరుగుతుంది.

ఇలాంటి లక్షణాలు గనుక కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి ముందస్తుగా తగిని చికిత్స పొందటం మంచిది.

 

ట్రెండింగ్ వార్తలు