Alzheimer’s Disease : అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహయపడే డైట్ ప్లాన్ ఇదే!
అల్జీమర్స్ తీవ్రమైనప్పుడు ఆలోచించటం, తినటం, మాట్లాడటం వంటి రోజు వారిగా చేసే సాధారణ, సహజ సామర్థ్యాలను కోల్పోతారు. జ్ఞాపకశక్తి క్షీణించటాన్ని అల్జీమర్స్ గా చాలా మంది భావిస్తారు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటానికి అవకాశం ఉంది.

Alzheimer's Disease
Alzheimer’s Disease : అల్జీమర్స్ అనేది మెదడులో కణాలు చనిపోతుండటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బదింటాయి. అల్జీమర్స్ 65 సం వయస్సు దాటిన వారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. కేవలం వృద్దులకు మాత్రమే పరిమితనుకుంటే పొరపాటు పడ్డట్టే. పలు సందర్భాలలో 40-50 సం. వయస్సు వ్యక్తులలో కూడా అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ పరిస్ధితుల్లో దీనిని ఏమాత్రం తేలికగా తీసుకోకుండా వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స పొందటం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు.
అల్జీమర్స్ తీవ్రమైనప్పుడు ఆలోచించటం, తినటం, మాట్లాడటం వంటి రోజు వారిగా చేసే సాధారణ, సహజ సామర్థ్యాలను కోల్పోతారు. జ్ఞాపకశక్తి క్షీణించటాన్ని అల్జీమర్స్ గా చాలా మంది భావిస్తారు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటానికి అవకాశం ఉంది. వయస్సు పై బడటం కావచ్చు లేదా పోషకాహార లోపం కావచ్చు. మానసిక వత్తిడికి లోనవటం వల్ల మతిమరపు పెరగవచ్చు. జ్ఞాపక శక్తి క్షీణించ వచ్చు. అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే తగిని చికిత్స అందించటం ద్వారా మంచి జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుంది.
కొన్ని రకాల ఆహారాలు మెదడు పనితీరును పెంచటం ద్వారా అల్జీమర్స్ చికిత్సలో తోడ్పడతాయి. జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి కొన్ని రకాల ఆహారాలను ఎంచుకోవటం మంచిది. ఆకుకూరలైన కాలే, బచ్చలికూర, పాలకూర వంటివి వారానికి కనీసం 6 సార్లు తీసుకోవాలి. నట్స్ గా చెప్పబడే బాదం, జీడిపప్పు, పిస్తా వంటివి వారానికి కనీసం 5 సార్లు కొద్ది మొత్తంలో తీసుకోవాలి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్, బ్లాక్ బీన్స్, పింటో బీన్స్, కిడ్నీ బీన్స్, తృణధాన్యాలైన క్వినోవా, వోట్మీల్, బ్రౌన్ రైస్, హోల్ గ్రెయిన్ పాస్తా , బ్రెడ్ వంటివి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సాల్మన్, ట్యూనా, ట్రౌట్ చేపలు వారానికి కనీసం 1 సారైనా తీసుకోవాలి. చికెన్ వారానికి రెండు సార్లు, వంటలలో ఆలివ్ నూనె ఉపయోగించాలి. ఎర్ర మాంసం తినటం తగ్గించాలి. వెన్న, వనస్పతి వంటివి రోజువారీగా 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ మించకుండా చూసుకోవాలి. కేక్‌లు, లడ్డూలు, ఐస్ క్రీం వంటి తీపి పదార్ధాలు తినకపోవటమే మంచిది.