tips for knee care
knee Care : ప్రజలలో ఎముకలు, కీళ్ల ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి , అనేక కండర కణజాల రుగ్మతలను నివారించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఎముకలు, కీళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. శరీరంలోని ముఖ్యమైన భాగాలలో ఒకటి మోకాళ్లు. వీటి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వయస్సుతో పాటు, జీవితాన్ని సమస్యాత్మకంగా మారుస్తుంది.
READ ALSO: వర్షాకాలం, శీతాకాలాల్లో మీ మోకాలు ఎందుకు నొప్పిపెడుతుందో తెలుసా?
మోకాళ్లు మనకు నిత్య జీవితంలో కదలడానికి ,అటు ఇటు నడవటానికి సహాయపడతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, మన మోకాళ్లు బలహీనంగా , బాధాకరంగా మారతాయి. ఇది ఆర్థరైటిస్, సరిగా నడవలేకపోవటం వంటి సమస్యలకు దారితీస్తుంది. మోకాళ్లను జాగ్రత్తగా చూసుకోవడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
READ ALSO: Walking : మోకాలి నొప్పులతో బాధపడేవారు వాకింగ్ చెయ్యెచ్చా ?
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించటం ; అధిక బరువు ఉండటం వలన మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో అవి గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం చాలా ముఖ్యం.
READ ALSO: High Blood Pressure : అధిక రక్తపోటును అదుపులో ఉంచే… యోగాసనాలు
సరైన బూట్లు ధరించటం ; సరైన రకమైన బూట్లు ధరించడం వల్ల మోకాళ్లు గాయాల నుండి రక్షించుకోవచ్చు. మోకాళ్లకు మంచి మద్దతుగా ఉండే, మెత్తదనాన్ని అందించే బూట్లు మోకాలి ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
కండరాలను బలోపేతం చేయడం ; బలమైన కండరాలు మోకాళ్లకు మేలు చేయటమే కాకుండా, కీళ్లపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా గాయాలను నివారించడంలో కూడా సహాయపడతాయి. మోకాలి కీలు చుట్టూ కండరాలకు సహాయపడే వ్యాయామాలను రోజువారి చేయటం ద్వారా కీళ్లనొప్పులు రాకుండా చూసుకోవచ్చు.
READ ALSO: Back Pain : ఈ వ్యాయామాలు నడుమునొప్పితో పాటు కండరాల నొప్పులను తగ్గిస్తాయ్!
కీళ్లనొప్పుల సమయంలో విశ్రాంతి తీసుకోవటం : నొప్పులు ఉన్నసమయంలో మోకాలి కదలికలతో కూడిన కార్యకలాపాలను క్రమం తప్పకుండా విరామం తీసుకోవటం మంచిది. ఇలా చేయటం అన్నది మోకాలి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
వృత్తిపరమైన సలహాలను తీసుకోండి: ఏదైనా మోకాలి నొప్పి, అసౌకర్యం ఉంటే, ఫిజికల్ థెరపిస్ట్ లేదా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.
ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా, మోకాళ్లను మంచి స్థితిలో ఉంచడంలో సహాయపడతాయి. భవిష్యత్తులో గాయాలు, అనారోగ్యాలు రాకుండా నిరోధించవచ్చు.