వర్షాకాలం, శీతాకాలాల్లో మీ మోకాలు ఎందుకు నొప్పిపెడుతుందో తెలుసా?

  • Published By: sreehari ,Published On : September 1, 2020 / 02:37 PM IST
వర్షాకాలం, శీతాకాలాల్లో మీ మోకాలు ఎందుకు నొప్పిపెడుతుందో తెలుసా?

తరచూ మీ మోకాళ్లు నొప్పిగా ఉంటున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. ఏముందిలే అని లైట్ గా తీసుకోవద్దు.. వర్షకాలం, శీతాకాలంలో మీ మోకాళ్లు నొప్పిగా ఉంటే ఎంతమాత్రం అశ్రద్ధ చేయొద్దని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.. సాధారణంగా.. చలికాలం లేదా వర్షాకాలం వచ్చినప్పుడు చాలామందిలో కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు అసలు వాతావరణంలో మార్పులకు కీళ్ల నొప్పులకు ఎలాంటి సంబంధం లేదనే అధ్యయనాలు లేకపోలేదు.



ఈ రెండింటిలోనూ కచ్చితమైన రుజువు లేదని కాలిఫోర్నియాకు చెందిన Milo F. Bryant చెప్పారు. Tufts University నుంచి 2007లో అధ్యయనాన్ని ఓసారి పరిశీలిస్తే.. వాతావరణం మార్పులతో 200 మందిలో మోకాలి నొప్పులకు కారణమైందని కనుగొన్నారు.. ఉష్ణోగ్రతలో ప్రతి 10 డిగ్రీలు తగ్గిన సమయంలో మోకాలి నొప్పి పెరుగుతుందని కనిపెట్టారు.

బారో మెట్రిక్ పీడనం పెరుగుదల కూడా మోకాలినొప్పితో ముడిపడి ఉందని డచ్ పరిశోధకులు నిర్ధారించారు.వాతావరణంలో తేమ 10 శాతానికి పెరిగినప్పుడు మోకాలి నొప్పి తీవ్రమైందని గుర్తించామన్నారు. అధ్యయనాల ప్రకారం పరిశీలిస్తే.. మోకాలి నొప్పికి వాతావరణం మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆస్ట్రేలియా నుంచి మరో రెండు ప్రాథమిక అధ్యయనాలు తేల్చేశాయి.

మోకాలి నొప్పి ఎందుకు వస్తుంది? :
అసలు వాస్తవం ఏంటంటే.. కీళ్లలో ఆర్థరైటిస్ సమస్య అధికంగా ఉన్నవారిలో చల్లగా లేదా వర్షంగా ఉన్నప్పుడు మోకాళ్లలో నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. బారో మెట్రిక్ పీడనంలో కూడా భారీ మార్పులు కనిపించాయి. శరీరంలోని కండరాలు, కణజాలంపై ప్రభావం పడి నొప్పికి దారితీస్తాయని గుర్తించారు. ఆర్థరైటిస్ బారిన పడినవారిలో మోకాలి నొప్పి తీవ్రంగా ఉంటుందని డాక్టర్ ఫ్రెడెరిక్సన్ తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కీళ్లలో సైనోవియల్ ద్రవణాన్ని చిక్కగా చేస్తాయని అందుకే నొప్పిగా అనిపిస్తాయని స్పష్టం చేశారు.



మోకాళ్లలో ఉంటే Synovial fluid… కీళ్లకు 10w-40 వరకు అవసరం ఉంటుంది.. జాయింట్ల మధ్య కీళ్లు అటు ఇటు కదిలేటప్పుడు సున్నితంగా ఉండేందుకు ఈ ద్రావణం సాయపడుతుంది. ఒకవేళ ఈ ద్రావణం కానీ చిక్కబడితే మాత్రం జాయింట్ కీళ్లలో బిగుతుగా పట్టేసినట్టు అనిపిస్తుంటుంది..

మోకాలి నొప్పి వస్తే.. అశ్రద్ధ చేయొద్దు.. మరేం చేయాలి? :
మోకాలి నొప్పిగా అనిపించినప్పుడు.. కొంచెం కూడా అశ్రద్ధ చేయొద్దు.. వాతావరణం బాగోలేని సమయంలో మోకాలికి గాయమైతే తీవ్రమైన నొప్పి ఉంటుంది.. ఆరోగ్యంగా ఉన్నవారిలో మోకాలినొప్పి ఎందుకు వస్తుందో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆర్థరైటిస్ సమస్య కారణంగా చాలామందిలో మోకాలి నొప్పిలకు దారితీస్తుందని చెబుతున్నారు. అందుకు మోకాలు నొప్పిగా అనిపిస్తే.. అది ఎందుకు ఏ కారణం వల్ల వస్తుందో ముందుగా నిర్ధారించుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.



బయట వాతావరణం ఎక్కువ తేమగా ఉన్పప్పుడు.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మీ కీళ్లు దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా మందపాటి దుస్తులను ధరించాలి.. మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.. స్నానం చేస్తే వేడినీళ్లతో చేస్తుండాలి.. స్టీమ్ బాత్ లు కూడా మంచి ఉమశమనం కలిగిస్తాయి.. అంతేకాదు.. స్టెరాయిడ్ కానీ నిరోధక మందులు, సిబిడి వంటి నొప్పుల మందులను తీసుకోవాలని డాక్టర్ ఫ్రెడెరిక్సన్ సూచించారు.