Heart Health in Winter : చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడు కోవాలంటే ?

శీతాకాలం క్యాలరీలతో కూడిన భోజనం కంటే సమతుల్య ఆహారం తీసుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి సారించాలి.

Heart Health in Winter : శీతాకాలం ప్రారంభమైంది. చల్లిని గాలులతో కూడిన చలి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవాలలో గుండె ఒకటి. దీనిని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. చలికాలంలో గుండెపోటు మరణాల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న వ్యక్తులు రక్తపోటును నిరంతరం పర్యవేక్షించడంతోపాటుగా, వెచ్చని దుస్తులను ధరించడం, చలి వాతావరణంలో బయటకు రాకుండా ఇంటి లోపల ఉండడం, ఒత్తిడిని తగ్గించుకోవటం సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

READ ALSO : Heart Health : ఆఫీస్ విధులలో ఎక్కువ గంటలు గడిపితే గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ?

శీతాకాలం గుండె ఆరోగ్యానికి ఎలా హానికరం ;

చల్లని వాతావరణంలో వ్యాయామం చేయటం వల్ల రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఇది రక్తపోటును పెరిగేలా చేస్తుంది. ఆకస్మిక గుండె మరణాలకు దారితీస్తుంది. చలికాలం గుండె ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది. రక్తపోటును పెంచుతుంది. గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. చల్లని చలి హృదయ స్పందన రేటు పెరగడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో రక్తం చిక్కగా మారి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

చలిలో శారీరక శ్రమ చేయడం వల్ల హృదయనాళ వ్యవస్థపై అదనపు భారం పడుతుంది. ఈ నెలల్లో ఆరుబయటకాకుండా ఇంట్లోనే వ్యాయామం చేయడం మంచిది. ముఖ్యంగా వృద్ధుల్లో హృదయ సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. గుండె జబ్బుల కలిగిన వారు చలికాలంలో అదనపు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Protect Heart Health : మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !

చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ;

1. రక్తపోటు నిరంతర పర్యవేక్షణ ;

రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా అవసరం, ముఖ్యంగా చల్లని వాతావరణం చ ఒత్తిడి వంటి అంశాలు రక్తపోటు హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. ఈ సందర్భంలో నిరంతర పర్యవేక్షణ అవసరం. ఏమైన అసాధారణ రక్తపోటు హెచ్చుతగ్గులు గుర్తిస్తే వెంటనే వైద్యుల సూచనలను పాటించటం మంచిది.

2. వైద్యులు సిఫార్సు చేసిన మందులు వాడటం ;

శీతాకాలం అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. సీజన్ ప్రారంభమయ్యే ముందు, ఛాతీ ఇన్‌ఫెక్షన్‌లను నివారించడానికి ఇన్‌ఫ్లుఎంజా , న్యుమోనియా వ్యాక్సిన్‌లను స్వీకరించడం మంచిది. ఇన్ఫెక్షన్లకు సంబంధించి ఏవైనా లక్షణాలు ఉంటే వైద్యులు సూచించిన విధంగా యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా వెంటనే వాటిని పరిష్కరించుకోవచ్చు. చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం వైద్యులు సూచించిన విధంగా మందులను వాడుకోవాలి.

READ ALSO : Heart Health : గుండె ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు !

3. వెచ్చధనాన్ని ఇచ్చే బట్టలు ధరించాలి ;

చలికాలం సీజన్ లో శరీరాన్ని వెచ్చగా ఉంచటానికి సరైన శీతాకాలపు దుస్తులు ధరించడం చాలా అవసరం. వెచ్చని జాకెట్లు, టోపీలు, బూట్లు , గ్లోవ్స్‌ ధరించాలి. వీటి వల్ల శరీరానికి వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అంటువ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. తద్వారా గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

4. ఇంటి లోపల యాక్టివ్ గా ఉండటం ;

బయటి చల్లని వాతావరణంలో వ్యాయామాలు చేయటం, ఎక్కువ సమయం గడపటం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి వ్యాయామాలను ఇంటిలోపలే చేయాలి. రెగ్యులర్ శారీరక శ్రమ గుండె ఆరోగ్యానికి కీలకం కాబట్టి శీతాకాల పరిస్థితులలో ఇండోర్ వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. శారీరక శ్రమ , సాధారణ వ్యాయామం ఆరోగ్యకరమైన బరువును,హృదయనాళ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

READ ALSO : Heart Disease : మధుమేహం నుండి అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వరకు గుండె జబ్బులు రావటానికి 5 ప్రమాద కారకాలు !

5. గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ;

శీతాకాలం క్యాలరీలతో కూడిన భోజనం కంటే సమతుల్య ఆహారం తీసుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి సారించాలి. ఈ ఆహారాలలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అధిక ఉప్పు రక్తపోటుకు కారణమవుతుంది.

6. హైడ్రేటెడ్ గా ఉండటం ;

చలికాలంలో దాహం వేయటంలేదని నీరు సరిగా తీసుకోరు. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. నీరు పుష్కలంగా తీసుకోవటం వల్ల గుండె పంపింగ్ సామర్థ్యం మెరుగవుతుంది. అదే క్రమంలో వెచ్చగా ఉండేందుకు హెర్బల్ టీలు, సూప్‌ల వంటి పానీయాలను తీసుకోవాలి.

READ ALSO : Green Gram Dal : గుండె ఆరోగ్యానికి మేలు చేసే పెసరపప్పు !

7. ఒత్తిడిని తగ్గించుకోవటం ;

శీతాకాలంలో చల్లని వాతావరణం అదనపు ఒత్తిడికి కారణమవతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీర ఆరోగ్యానికి దినచర్యలో ధ్యానం, శ్వాస వ్యాయామాలు, యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను ఎంచుకోవాలి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది.

 

ట్రెండింగ్ వార్తలు