Shoe Bites : షూ కాటును నివారించాలంటే ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి !

షూలను కొనుగోలు చేయాలని దుకాణాలకు వెళ్ళినప్పుడు వాటిని ఒకసారి వేసుకుని అటుఇటు నడవాలి. ఏక్కడైనా పాదాలు వత్తుకున్నట్లు అనిపించటం కాని, రాపిడి ఉన్నాగాని వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందన్న అంచనాకు రావాలి.

Shoe Bites : కాళ్ళకు విభిన్న రకాల చెప్పులు, షూలను ధరించి స్టైలిష్ గా కనిపించాలని చాలా మంది కోరుకుంటుంటారు. ఇందుకోసం ఖరీదైన షూలు కొనుగోలు చేస్తారు. కొత్తగా ఉన్నప్పుడు వాటిని ధరిస్తే అసౌకర్యంగా ఉండటంతోపాటుగా వాటి రాపిడి వల్ల పాదాలపై బొబ్బలు రావటం ఆపై పుండ్లు పడటం జరుగుతుంది. ఇలాంటి సమస్యల కారణంగా ఖర్చు చేసి కొనుగోలు చేసిన షూలను సైతం చాలా మంది పక్కన నిరుపయోగంగా పడేస్తుంటారు. అయితే ఇలాంటి సమస్య ఎదురైనప్పు కొన్ని చిట్కాలతో దానిని నుండి బయటపడవచ్చు. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Vegetable Farming : ఊరు ఊరంతా ఆకు కూరల సాగు.. మంచి లాభాలు ఆర్జిస్తున్న రైతులు

షూలను కొనుగోలు చేయాలని దుకాణాలకు వెళ్ళినప్పుడు వాటిని ఒకసారి వేసుకుని అటుఇటు నడవాలి. ఏక్కడైనా పాదాలు వత్తుకున్నట్లు అనిపించటం కాని, రాపిడి ఉన్నాగాని వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందన్న అంచనాకు రావాలి. అలాంటి వాటిని కొనుగోలు చేయకపోవటమే మంచిది. ఒకవేళ షూ కొనుగోలు చేసిన తరువాత పాదలకు ఇబ్బందులు తలెత్తితే అలాంటి వాటిని వేసుకోకుండా పక్కన పడేయటమే మంచిది. ఎందుకంటే సమస్య మరింత జఠిలం అయ్యే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !

షూధరించటం వల్ల పాదాలకు బొబ్బలు రావటం, పండ్లు పడటం వంటివి జరిగితే వాటిని వాడకుండా పక్కన పడేయాలి. వాటికి స్ధానంలో చెప్పులు ధరించాలి. గాయాలు త్వరగా మానాలంటే గాలి తోలే విధంగా ఒపెన్ గా ఉండేలా చెప్పులు ధరించటమే ఉత్తమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చర్మం రాపిడికి గురైన ప్రాంతంలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. చివరకు అది ఇన్ ఫెక్షన్ కు దారి తీసే ప్రమాదం ఉన్నందున దాని నివారించేందుకు యాంటీ బయాటిక్ అయింట్ మెంట్లను అప్లై చేయాలి.

READ ALSO : Diabetic Nephropathy : డయాబెటిస్‌ ఉన్నవారు కిడ్నీ సమస్యలను ఎదుర్కోవటం ఎలాగంటే ?

షూ రాపిడి చాలా మందిని బాధిస్తుంది. తీవ్రమైన మంటతోపాటు, పాదాల నొప్పి కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో తక్షణ ఉపశమనం కోసం ఐస్ క్యూబ్ లను గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి. ఇలా చేయటం ద్వారా నొప్పి తోపాటు, ఆప్రాంతంలో వాపును కూడా తగ్గించుకోవచ్చు. షూ కాటు కారణంగా ఏర్పడిన గాయాలు త్వరగా మానేందుకు కొబ్బరి నూనె, పసుపు కలిపి లేపనంగా అప్లై చేయటం ద్వారా పడిన గాయం త్వరగా మానిపోతుంది. అలాగే టూత్ పేస్ట్ ను రాసి కొద్ది సమయం త్వరువాత గుడ్డతో తుడిచిచేయాలి. అపై వాసెలిన్ జెల్లీ, కొబ్బరి నూనె వంటివాటిని అప్లై చేయటం ద్వారా గాయం తర్వగా మానేలా చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు