Vegetable Farming : ఊరు ఊరంతా ఆకు కూరల సాగు.. మంచి లాభాలు ఆర్జిస్తున్న రైతులు

ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండటంతో వారి పంటల సాగు మూడు పువ్వులు.., ఆరు కాయలు గా సాగుతునున్నది. తీరొక్క ఆకుకూరలు పండిస్తూ.. రోజువారీగా ఆదాయం పొందుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు…

Vegetable Farming : ఊరు ఊరంతా ఆకు కూరల సాగు.. మంచి లాభాలు ఆర్జిస్తున్న రైతులు

Vegetable Farming

Vegetable Farming : ఆ ఊరంతా ఆకుకూరలే పండిస్తారు. పెట్టుబడి తక్కువ.., లాభాలు ఎక్కువగా ఉన్న ఈ పంటలతో నష్టం అనేదే లేదని చెబుతున్నారు  ఎన్టీఆర్ జిల్లాలోని కంచల గ్రామ రైతులు. ఎన్నో ఏండ్ల నుంచి ఆకుకూరలు పండిస్తూ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

READ ALSO : Chicken Soup : ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి చికెన్ సూప్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !

ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండటంతో వారి పంటల సాగు మూడు పువ్వులు.., ఆరు కాయలు గా సాగుతునున్నది. తీరొక్క ఆకుకూరలు పండిస్తూ.. రోజువారీగా ఆదాయం పొందుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు…

READ ALSO : Shrimp Farming : రొయ్య పిల్లల ఎంపికలో జాగ్రత్తలు

ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం మండలం పరిధిలోని ఊరు.. కంచల . ఆ గ్రామంలో 700 పైగా ఇళ్లు ఉన్నాయి. అందులో దాదాపు 2,800 మంది జనాభా ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారు ఏడాది పొడవునా ఆకుకూరలే పండిస్తుంటారు. వాటితో నిత్యం డబ్బులే కల్లారా చూస్తుంటారు..

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

వరి, మొక్కజొన్న ఇలా ఏ పంటలు సాగు చేసిన పంట కాలం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి భారం కూడా పెరుగుతుంది. ఆకుకూరల సాగుతో రైతులకు పెట్టుబడి భారం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పూర్వికులనుండే ఆనవాయితిగా వచ్చిన ఆకుకూరలను చేపడుతూ.. రోజువారి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో.. మంచి ఆకు దిగుబడులను ఇచ్చే ఆకు కూరలను ఎంచుకున్నారు. సీజన్ లకు అనుగుణంగా ఆకు వచ్చే విధంగా ప్రణాళికలతో సాగుచేస్తున్నారు.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

ఆకుకూరల పంట కాలం నెలలోపే ఉంటుంది. దీంతో ఆదాయం రావాలంటే ఆకుకూరలైతేనే మేలని, తోటకూర, పాలకూర, బచ్చలకూర, సుక్కకూర, గోంగూర కూర, మెంతి, కొత్తిమీర, పూదీన ఇలా రకరకాల ఆకుకూరలు పండిస్తున్నారు. ఏ రైతు పొలం చూసినా పచ్చని ఆకుకూరలతో కలకలలాడుతున్నాయి. ఏ రోజుకారోజు పంట చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు రైతులు.