Shrimp Farming : రొయ్య పిల్లల ఎంపికలో జాగ్రత్తలు

లక్షలు పెట్టి రొయ్య పిల్లలను కొనుగోలు చేసి, చెరువుల్లో వదిలిన నెల రోజులకే అవి చనిపోతుండటంతో , రొయ్యల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే 25 ఏళ్ళుగా రొయ్య పిల్లల ఉత్పత్తిలో ఉన్న రైతు పడవల ఏడుకొండలు రైతులకు నాణ్యమైన పిల్లలను అందిస్తున్నారు.

Shrimp Farming : రొయ్య పిల్లల ఎంపికలో జాగ్రత్తలు

Shrimp Farming

Shrimp Farming : వ్యవసాయంలో నాణ్యమైన, అధిక దిగుబడుల కోసం విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యం. అలాగే మత్స్య పరిశ్రమలోనైన అంతే.. ఎంచుకునే పిల్ల ఆరోగ్యంమీదే దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ శీతాకాలంలో వాతావరణ ఇబ్బందులకు తోడు తొందరగా వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రొయ్యలు పెంచాలనుకునే రైతులు ఎలాంటి పిల్లలను ఎంపిక చేసుకోవాలి.. వాటికి ఎలాంటి పరిక్షలు చేయాలో ఇప్పుడు తెలుకుందాం…

READ ALSO : Madurai Meenakshi : వీణానాదంతో 108 మంది మహిళలు మీనాక్షి అమ్మకు స్వరనీరాజనం

కొన్నేళ్ల కిందటి వరకు రైతులకు సిరులు కురిపించిన రొయ్యల సాగు..  కొంతకాలంగా తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతుంది. దీనికి కారణం హేచరీల నుండి సరైన సీడ్ లభ్యంకాక పోవడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు రొయ్యల సీడ్ ను హేచరీల వద్ద నుండి కొనేటప్పుడు ఖచ్చితంగా ఆ సీడ్ ను ల్యాబ్ లలో టెస్ట్ చేయించు కోవాల్సిఉంటుంది. టెస్టులు చేయించకుండా సీడ్ ను చెరువుల్లోకి వదలడం వల్ల రైతులకు అన్ని సార్లు లాభాలు వచ్చే పరిస్థితి ఉండదు.

READ ALSO : Eatala Rajender : కేసీఆర్ పైసల్ని,దుర్మార్గాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు .. నాదిప్పుడు చావో రేవో పరిస్థితి : ఈటల రాజేందర్

ఎక్కువ శాతం మంది రైతులు హేచరీలను గుడ్డిగా నమ్మి ఎటువంటి టెస్టులు చేయించకుండా సీడ్ ను.. కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతున్నారు.  దీనివల్ల రైతులు సీడ్ వేసిన కొద్దిరోజుల్లోనే రొయ్యపిల్ల ఆక్సిజన్ అందక చనిపోతుంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. చెరువులో సీడ్ వేసేముందు చెరువులోని నీటిని కూడా పరీక్ష చేయించాల్సిఉంది . సీడ్  ను కొనుగోలు చేసేటప్పుడు హేచరీ యజమానులు చూపించే ల్యాబ్ రిపోర్టులపై నమ్మకం పెట్టుకోకుండా సీడ్ ను టెస్ట్ చేసి నాణ్యమైన సీడ్ ను మాత్రమే ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా రైతులు లాభాల బారిన పడతారని వివరాలు తెలియజేస్తున్నారు… ఏలూరు జిల్లా, ఆక్వాకల్చర్ కన్సల్టెంట్ బొమ్మిడి  రవి శ్రీనివాస్ .

READ ALSO : Breast Cancer : రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారించటం ఎలా?

మార్కెట్ లో దొరికే నాసిరకం సీడ్ తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షలు పెట్టి రొయ్య పిల్లలను కొనుగోలు చేసి, చెరువుల్లో వదిలిన నెల రోజులకే అవి చనిపోతుండటంతో , రొయ్యల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే 25 ఏళ్ళుగా రొయ్య పిల్లల ఉత్పత్తిలో ఉన్న రైతు పడవల ఏడుకొండలు రైతులకు నాణ్యమైన పిల్లలను అందిస్తున్నారు. హేచరీ కంపెనీల వద్ద.. సీడు కొనుగోలు చేస్తూ.. వాటికి స్థానిక ల్యాబుల్లో అన్ని పరీక్షలు చేయించి జీరోసైజ్ వచ్చే వరకు అంటే 20 రోజుల పాటు పెంచి.. రైతులకు ఒక్కో పిల్లను 20 పైసల చొప్పున అందిస్తున్నారు.