Chicken Soup : ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి చికెన్ సూప్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !

ఆహారంగానే కాకుండా, చికెన్ సూప్ లో కొన్ని వైద్యపరమైన లక్షణాలు ఉన్నాయి. వేడివేడి చికెన్ సూప్ తీసుకునే సమయంలో దాని నుండి వచ్చే ఆవిరి జలుబుతోబాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. వేడి సూప్ గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

Chicken Soup : ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న వారికి చికెన్ సూప్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !

chicken soup

Chicken Soup : మనదేశంలోని సాంప్రదాయబద్దమైన ఆహారాలు, వంటకాలు మంచి రుచితోపాటు అందరూ ఇష్టపడేలా ఉంటాయి. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించటంలో సహాయపడతాయి. ఈ కోవలేకే వస్తుంది సాంప్రదాయ వంకటకమైన చికెన్ సూప్. ఆయుర్వేద సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ చికెన్ సూప్ తీసుకోవటం అన్నది ఎన్నో తరాలుగా వస్తుంది. అనేక పోషకవిలువలు ఈ చికెన్ సూప్ తీసుకోవటం ద్వారా మన శరీరానికి అందుతాయి.

READ ALSO : Kidney Stones : చక్కెర పదార్ధాలతో కిడ్నీలో రాళ్ల ముప్పు !

చికెన్ సూప్ లో పోషకాలు ;

చికెన్ సూప్ కేవలం రుచికలిగినది మాత్రమే కాకుండా పోషకాలతో నిండి ఉంటుంది. ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల కండరాల పునరుద్ధరణ, పెరుగుదలకు సహాయపడుతుంది. సూప్‌లో ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు కీలకమైన విటమిన్ ఎ , సెల్ ఆరోగ్యానికి దోహదపడే విటమిన్ బిలు ఉన్నాయి. వీటితో పాటు, పొటాషియం,మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో , గుండె పనితీరును మెరుగుపరచటంలో సహాయపడతాయి.

READ ALSO : Liver Health : లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఇవే!

చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు చికెన్ సూప్

ఆహారంగానే కాకుండా, చికెన్ సూప్ లో కొన్ని వైద్యపరమైన లక్షణాలు ఉన్నాయి. వేడివేడి చికెన్ సూప్ తీసుకునే సమయంలో దాని నుండి వచ్చే ఆవిరి జలుబుతోబాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. వేడి సూప్ గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో దీనిని సేవించటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి పెంపొందించటంతోపాటు, స్వల్పతరహా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని తీసుకోవటం ద్వారా త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.

READ ALSO : Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !

చికెన్ సూప్‌లో ఉపయోగించే మసాలాలు రుచితోపాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇందులో ఉపయోగించే పసుపు, అల్లం , వెల్లుల్లి వంటి పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

చికెన్ సూప్‌తో బరువు అదుపులో

బరువును నియంత్రించుకోవాలనే వారికి, ఒక గిన్నె చికెన్ సూప్ తక్కువ కేలరీలను కలిగి ఉన్న భోజనంగా దోహదపడుతుంది. దీనిలోని అధిక ప్రోటీన్ కంటెంట్ కారణంగా కడుపు నిండి ఉన్న భావన కలుగుతుంది. దీంతో క్యాలరీలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

చివరగా చికెన్ సూప్ కేవలం వంటకంగా కంటే ఎక్కువ పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పవర్‌హౌస్ గా చెప్పవచ్చు. జలుబు నుండి త్వరగా ఉపశమనం కలగాలనుకునేవారు, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని చూస్తున్నవారు, తక్కువ కేలరీల భోజనాన్నికోరుకునేవారు చికెన్ సూప్ ను తీసుకోవచ్చు.