Valentine’s Day 2025 : వాలెంటైన్స్ డే ‘రియల్ హిస్టరీ’ ఏంటో తెలుసా? ఎందుకు జరుపుకుంటారు? ఈ స్పెషల్ డేపై ఆసక్తికరమైన విషయాలివే..!

Valentine's Day 2025 : ప్రేమికులకు ఎంతో ముఖ్యమైన రోజు వాలెంటైన్స్ డే.. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ప్రేమికుల దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు. కానీ, ఈ రోజు వెనుక ఒక విషాధ గాథ దాగి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Valentine’s Day 2025 : వాలెంటైన్స్ డే ‘రియల్ హిస్టరీ’ ఏంటో తెలుసా? ఎందుకు జరుపుకుంటారు? ఈ స్పెషల్ డేపై ఆసక్తికరమైన విషయాలివే..!

Valentine's Day 2025

Updated On : February 13, 2025 / 7:13 PM IST

Valentine’s Day 2025 : వాలెంటైన్స్ డే.. దీన్నే ప్రేమికుల దినోత్సవంగా పిలుస్తారు. వాలెంటైన్స్ వీక్ అనేది ఒక వారం ముందుగానే ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమై ఫిబ్రవరి 14న గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది.

కానీ, వాలెంటైన్స్ డే ఎలా ప్రారంభమైంది? అసలు ఎందుకు ఈ వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారు? దీని వెనుక అసలు రియల్ హిస్టరీ ఏంటి? అనేది మీకు తెలుసా? మీకు ఈ ప్రేమికుల దినోత్సవం గురించి పెద్దగా తెలియకపోతే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : US Egg Crisis : అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఆకాశాన్నంటుతున్న ధరలు.. ఇంట్లోనే కోళ్లు పెంచేస్తున్నారు.. స్టోర్లలో ‘నో ఎగ్స్’ బోర్డులు..!

వాలెంటైన్స్ డే చరిత్ర ఏంటి? :
వాలెంటైన్స్ డే చరిత్ర రోమ్‌తో ముడిపడి ఉంది. మూడో శతాబ్దంలో, రోమ్‌లో సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి ఉండేవాడు. ప్రపంచంలో ప్రేమను వ్యాప్తి చేయాలని బాగా నమ్మాడు. ప్రేమే అతని జీవితం. ప్రజలను ప్రేమించేలా ప్రేరేపించాడు. కానీ, ఆ సమయంలో రోమ్ రాజు క్లాడియస్‌కు ప్రేమను ప్రోత్సహించడం నచ్చలేదు. వివాహం సైనికుల బలాన్ని, తెలివితేటలను ప్రభావితం చేస్తుందని అది వారిని యుద్ధంలో బలహీనపరుస్తుందని అతను నమ్మాడు. అందుకే అతడు తన సైనికులు, అధికారుల వివాహాలను నిషేధించాడు.

అయితే, రోమ్ రాజు నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, సెయింట్ వాలెంటైన్ దీనిని అంగీకరించలేదు. చక్రవర్తి ఆదేశాలను అతను ధిక్కరిస్తూ రహస్యంగా ప్రేమికులను వివాహం చేసుకోవడం ప్రారంభించాడు. ఈ విషయం క్లాడియస్ చక్రవర్తికి తెలియగానే, సెయింట్ వాలెంటైన్‌ను అరెస్టు చేసి, ఫిబ్రవరి 14, 269న అతనికి మరణశిక్ష విధించాడు.

సెయింట్ వాలెంటైన్ తాను జైలులో ఉన్న జైలర్ కుమార్తెతో ప్రేమలో పడ్డాడని, ఉరితీయడానికి ముందు, సెయింట్ వాలెంటైన్ జైలర్ కుమార్తెకు ఒక లేఖ రాశాడని, అందులో చివరలో ‘మీ వాలెంటైన్’ అని రాశాడని చెబుతారు. అప్పటి నుంచి ఈ రోజును ప్రేమ, అంకితభావానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఫిబ్రవరి 14ని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు.

వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? :
వాలెంటైన్స్ డే కేవలం భాగస్వాములకు మాత్రమే కాదు. ఇది ప్రేమ, స్నేహం లోతును సూచించే రోజు. మన స్నేహితుడి పట్ల మనకున్న ప్రేమను స్పష్టంగా వ్యక్తపరచడం ముఖ్యమని ఈ రోజు మనకు తెలియజేస్తుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. జంటలు ఒకరికొకరు కార్డులు, ఫ్లవర్స్, రొమాటింక్ శుభాకాంక్షలు పంపుకుంటారు. ఈ రొమాంటిక్ మార్గాల్లో వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా జరుపుకోవచ్చు.. మీ ప్రేమగల భాగస్వామికి బహుమతి ఇచ్చే బదులు ఈ పద్ధతులను ఓసారి ప్రయత్నించండి.

1. ప్రేమలేఖ రాయండి :
ప్రేమలేఖ అనేది పాతదే అయినా చాలా వెరైటీగా కూడా ఉంటుంది. పాత రోజుల్లో ఈ ప్రేమలేఖతో ఎన్నో ప్రేమలు నడిచాయి. నిజమైన భావోద్వేగాన్ని ఈ పద్ధతి ద్వారానే తెలియజేయొచ్చు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇదే అత్యంత మధురమైన మార్గం కావచ్చు. ఇందులో మీరు మీ భావాలను వ్యక్తపరచవచ్చు. ప్రియమైనవారితో గడిపిన ప్రత్యేక క్షణాలను ఈ లేఖ ద్వారా గుర్తుంచుకోవచ్చు.

Read Also : iPhone Offers : వాలెంటైన్స్ డే రోజున మీ గర్ల్ ఫ్రెండ్‌కు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వేల డిస్కౌంట్లు మీకోసం..!

2. ఆల్బమ్‌ను క్రియేట్ చేయండి :
ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునే ఈ విధానం కూడా చాలా ప్రత్యేకమైనది. మీరు మీ భాగస్వామితో గడిపిన జ్ఞాపకాలు, ఫోటోలను ఆల్బమ్‌లో సెట్ చేసుకోవచ్చు. మీరు ఆ ప్రత్యేక ఫోటోలను ఎంచుకుని వాటిపై కొన్ని లవ్ కోట్స్ రాయొచ్చు.

3. మీరు డిన్నర్ ప్లాన్ చేయండి :
మీ వాలెంటైన్స్ డే ప్రత్యేకంగా ఉండేందుకు మీరు రొమాంటిక్ డిన్నర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ భాగస్వామికి ఇష్టమైన విధంగా అన్ని ఏర్పాట్లు చేయొచ్చు. మీరు అతనికి/ఆమెకు ఇష్టమైన వంటకం వండవచ్చు లేదా ఏదైనా రెస్టారెంట్‌కు తీసుకెళ్లవచ్చు.