Potato Juice : చర్మ సంరక్షణకు బంగాళ దుంపల రసం తో !

చర్మ సంరక్షణ కోసం బియ్యాన్ని ఉడకబెట్టి నీటిలో బంగాళదుంప రసాన్ని కలిపి కాటన్ సహాయంతో చర్మానికి పట్టించాలి. ఇలా చేసిన తర్వాత నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

Potato Juice : చర్మ సంరక్షణకు బంగాళ దుంపల రసం తో !

Potato Juice :

Updated On : January 5, 2023 / 12:23 PM IST

Potato Juice : బంగాళదుంపలతో చేసిన ఆహారాలను అంతా ఇష్టంగా తింటారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభించటంతోపాటు శరీర దృఢంగా మారేందుకు దుంపలు ఉపయోగపడతాయి. దుంపల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పొడి చర్మం సమస్యలతో బాధపడేవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, మురికి వదిలించడానికి బంగాళదుంప ప్రధాన పాత్ర పోషిస్తుంది. బంగాళదుంపల రసాన్ని వివిధ రూపాల్లో చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

చర్మ సౌందర్యానికి బంగాళదుంప రసంతో ;

నిమ్మరం, బంగాళ దుంపల జ్యూస్ ; బంగాళా దుంప‌ల జ్యూస్‌ను కొద్దిగా తీసుకుని అందులో నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై ఉన్న నల్లటి మచ్చలపై రాయాలి. ఇలా త‌ర‌చూ చేస్తే నల్లమచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖానికి స‌హ‌జ‌సిద్ధ‌మైన కాంతి ల‌భిస్తుంది.

బంగాళాదుంప రసం, పెరుగు: బంగాళాదుంప రసంలో పెరుగును కలిపి చర్మానికి వినియోగిస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మిశ్రమం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మంపై నూనెను కూడా పీల్చుకుని జిడ్డును పోగొడుతుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకుని దానికి మూడు చెంచాల బంగాళదుంప రసం కలపండి. చిటికెడు పసుపు కలిపిన తర్వాత బ్రష్‌తో చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.

అలోవెరా, బంగాళాదుంప: అలోవెరా జెల్ చర్మానికి కూడా మంచి ఔషధంలా పని చేస్తుంది. బంగాళదుంపను పేస్ట్ తయారు చేసి అందులో అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా అలోవెరా జెల్‌ని చేతిలోకి తీసుకుని ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోవాలి.

బియ్యం, బంగాళదుంపలు: చర్మ సంరక్షణ కోసం బియ్యాన్ని ఉడకబెట్టి నీటిలో బంగాళదుంప రసాన్ని కలిపి కాటన్ సహాయంతో చర్మానికి పట్టించాలి. ఇలా చేసిన తర్వాత నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

బేగింగ్ సోడా, బంగాళదుంప రసం; 5 స్పూన్ల బంగాళ దుంపల జ్యూస్‌, ఒక స్పూన్ బేకింగ్ సోడాను క‌లిపి అందులో స‌రిప‌డేంత నీటిని పోసి క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి కొద్ది సేపు ఆగాక క‌డిగేయాలి. దీంతో ముఖంపై ఉండే పోర్స్ శుభ్ర‌మ‌వుతాయి.

కీరదోస, బంగాళదుంప రసం ; బంగాళా దుంప‌ల జ్యూస్‌, కీర దోస జ్యూస్‌ల‌ను స‌మ‌భాగాల్లో తీసుకుని బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని క‌ళ్ల కింద అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డార్క్ సర్కిల్స్ త‌గ్గుతాయి.