Viral Pic: 1971లో మసాలా దోశ, కప్పు కాఫీ ధర ఎంతో తెలుసా?.. అప్పటి బిల్లు ఫొటో వైరల్

ఓ వ్యక్తి మోతీ మహల్ అనే రెస్టారెంటులో 1971, జూన్ 28న ఒక దోశ, ఒక కప్పు కాఫీ తాగి, వాటికి 10 పైసల సర్వీస్ చార్జ్ తో కలిపి రూ.2.10 ఇచ్చాడు. అప్పట్లో ఈ ధర చెల్లించి టిఫిన్ చేయడమే ఎక్కువ. ఇందుకు సంబంధించిన బిల్లును భద్రంగా దాచుకున్నాడు ఆ వ్యక్తి.

Viral Pic: 1971లో మసాలా దోశ, కప్పు కాఫీ ధర ఎంతో తెలుసా?.. అప్పటి బిల్లు ఫొటో వైరల్

Viral Pic

Updated On : January 23, 2023 / 1:10 PM IST

Viral Pic: ఒక్క మసాలా దోశ ధర ఎంతుంటుంది? కప్పు కాఫీ ధర ఎంత? సాధారణ హోటళ్లలో అయితే మసాలా దోశ ధర రూ.30 నుంచి రూ.80 మధ్య ఉంటుంది. ఇక కప్పు కాఫీ ధర రూ.10 నుంచి రూ.30 మధ్య ఉంటుంది. అయితే, రెస్టారెంటులో రూ.1కే దోశ, రూ.1కే కప్పు కాఫీ వస్తే? సర్వీస్ ఛార్జ్ 10 పైసలే ఉంటే? ఈ కాలంలో అంత తక్కువ ధరకు వస్తే ఆశ్చర్యపోతాం.. కానీ, ఒకప్పుడు దేశంలో ఈ ధరకే దోశ, ఇడ్లీ, ఉప్మా, వడ, కాఫీ, టీ లభించేవి.

దాదాపు 70 ఏళ్ల వయసు ఉన్నవారిని అడిగితే తమ చిన్నతనంలో రూపాయికి ఎన్నో పదార్థాలు వచ్చేవని చెబుతారు. 1971, జూన్ 28న ఓ వ్యక్తి మోతీ మహల్ అనే రెస్టారెంటులో ఒక దోశ, ఒక కప్పు కాఫీ తాగి, వాటికి 10 పైసల సర్వీస్ చార్జ్ తో కలిపి రూ.2.10 ఇచ్చాడు. అప్పట్లో ఈ ధర చెల్లించి టిఫిన్ చేయడమే ఎక్కువ.

ఇందుకు సంబంధించిన బిల్లును భద్రంగా దాచుకున్నాడు ఆ వ్యక్తి. తాజాగా, ఆ బిల్లు ఇంటిని శుభ్రం చేస్తోన్న వేళ దొరికిందేమో. ఈ బిల్లు ‘ఇండియన్ హిస్టరీ విత్ విష్ణు శర్మ’ అనే ట్విట్టర్ యూజర్ కంటపడింది. దాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ధరలు ఇంతగా పెరుగుతూ వచ్చాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది మంది యూశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.

Chai Wal Sharmistha Ghosh : బ్రిటీష్‌ కౌన్సిల్‌లో ఉద్యోగం కూడా మానేసి చాయ్ వాలాగా మారిన యువతి