Elections Results 2024 : ఈ లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూస్తున్న అభ్యర్థులు వీరే.. ఎవరెవరు ఉన్నారంటే?

Elections Results 2024 : బీజేపీ నేతలు స్మృతి ఇరానీ, కె అన్నామలై, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్‌కు చెందిన విక్రమాదిత్య సింగ్‌లు 2024 ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.

Elections Results 2024 : దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 10వ గంటకు చేరుకుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన దేశ ప్రజల తీర్పు రౌండ్‌ల వారీగా క్రమంగా వెల్లడవుతోంది. మెజారిటీ సీట్లలో తుది ఫలితాలు ఇంకా ప్రకటించనప్పటికీ, ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే… ఈ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ఓటమి ఖాయమైన కొంతమంది అభ్యర్థుల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి.

గతంలో రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీని చిత్తుగా ఓడించి 2019లో లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ.. ఈ 2024 ఏడాది ఎన్నికల్లో ఆమె భారీ ఓటమిని చవిచూస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయానికి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌కు చెందిన కిషోరి లాల్ శర్మ కన్నా 1.4 లక్షల ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

Read Also : Chiranjeevi – Pawan Kalyan : పవన్ గెలుపుపై మెగాస్టార్ ట్వీట్.. డియర్ కళ్యాణ్ బాబు అంటూ ఎమోషనల్ గా..

ఓటమి దిశగా సాగే అభ్యర్థుల జాబితాలో బీజేపీకి చెందిన కె అన్నామలై మరొకరు. ఐపీఎస్ అధికారి కె అన్నామలై కోయంబత్తూరు స్థానం నుంచి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. తమిళనాడు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ భారీగా లాభపడాలని భావిస్తోంది. అయితే, కౌంటింగ్ ట్రెండ్‌ల ప్రకారం.. ఈ లోక్‌సభ ఎన్నికలలో తొలిసారిగా బరిలో నిలిచిన అన్నామలై.. డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్ పి కన్నా 51వేల ఓట్లకు పైగా వెనుకంజలో ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ కంగనా రనౌత్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల సీజన్‌లో బీజేపీ తరపున టిక్కెట్‌పై ఆమె అరంగేట్రం చేసింది. ఈ హిమాచల్ మండి నియోజకవర్గంలో ఓట్ల తేడా 74వేల మార్క్ దాటింది. గతంలో ఆరుసార్లు హిమాచల్ సీఎంగా చేసిన దివంగత వీరభద్ర సింగ్, సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ కుమారుడే విక్రమాదిత్య సింగ్. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన కంగానకు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకే ప్రజలు మొగ్గుచూపారు.

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ చేతిలో ఓటమిని అంగీకరించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2 లక్షల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. తిరువనంతపురం పోరులో పలు పార్టీల మధ్య గట్టి పోటీ వాతావరణం నెలకొంది. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో థరూర్ కన్నా చంద్రశేఖర్ ఎన్నికల రేసులో ముందంజలో ఉన్నట్లు ట్రెండ్స్ చూపించాయి. కానీ, సాయంత్రం 5 గంటల సమయానికి శశిథరూర్ 16వేల ఓట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.

Read Also : Lok Sabha Election Results : రాజకీయ దురంధరుడుకి షాకిచ్చిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌..

ట్రెండింగ్ వార్తలు