Lok Sabha Election Results : రాజకీయ దురంధరుడుకి షాకిచ్చిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌..

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ యూసఫ్ ప‌ఠాన్ రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్నారు.

Lok Sabha Election Results : రాజకీయ దురంధరుడుకి షాకిచ్చిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌..

Yusuf Pathan won lok sabha elections defeated congress leader Adhir Ranjan Chowdhury

Updated On : June 4, 2024 / 6:13 PM IST

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ యూసఫ్ ప‌ఠాన్ రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పశ్చిమ బెంగాల్‌లోని బ‌హ‌రంపూర్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయ‌న విజ‌యం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి అధిర్‌ రంజన్‌ చౌధురిపై దాదాపు 70 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. యూస‌ఫ్ ప‌ఠాన్‌కు 458831 ఓట్లు రాగా రంజ‌న్‌కు 389729 ఓట్లు వ‌చ్చాయి.

2007, 2011 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడైన యూస‌ఫ్ ప‌ఠాన్ తొలి సారి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాడు. రాజకీయ దురంధరుడు, బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు, మూడు ఎంపీ అయిన అధిర్‌ రంజన్‌పై యూస‌ఫ్ గెల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బ‌రంపూర్ నుంచి అధిర్ రంజ‌న్ 1999 నుంచి వ‌రుస‌గా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైయ్యారు.

Theekshana : ఇది అన్యాయం.. మా విష‌యంలో ఇలా చేయ‌డం త‌గ‌దు..!

లోక్‌సభ​ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. బెంగాల్‌లో మొత్తం 42 స్థానాలు ఉండ‌గా ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ టీఎంసీ 29 స్థానాల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసే దిశ‌గా దూసుకువెలుతుంది. క్లీన్ స్వీప్ చేస్తుంద‌నుకున్న బీజేపీ 12 సీట్ల‌కే ప‌రిమ‌తం అయ్యేలా ఉంది.