Suman : 1000 వాలా ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు సుమన్ కు సన్మానం..
ఈ ఈవెంట్లో మూవీ యూనిట్ సీనియర్ నటుడు సుమన్ కు సన్మానం నిర్వహించారు.

1000 Wala Movie Unit Felicitated Suman in Pre Release Event
Suman : సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్ పై షారుఖ్ నిర్మాణంలో అఫ్జల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 1000 వాలా. ఈ సినిమాతో అమిత్ అనే కొత్త హీరో పరిచయం అవుతున్నాడు. సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్.. పలువురు ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.
Also Read : Nagarjuna : ‘తల’ సినిమా ఫస్ట్ టికెట్ కొన్న కింగ్ నాగార్జున..
ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో మూవీ యూనిట్ సీనియర్ నటుడు సుమన్ కు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ఈ సినిమా మొత్తం ఒక యంగ్ టీం చేయడం చాలా ఉత్సాహన్ని ఇచ్చింది. షూటింగ్ లోకేషన్ లో కూడా వీళ్ళ వర్క్ చూసి ముచ్చటేసింది. ఇందులో నేను కీలక పాత్ర పోషించాను. మూవీ యూనిట్ అందరికి అల్ ది బెస్ట్ అని తెలిపారు.
డిస్ట్రిబ్యూటర్ కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ.. సుమారు 280 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేయడానికి నేను ఈ యూనిట్ కి తోడుగా ఉంటాను అని తెలిపారు. హీరో అమిత్ మాట్లాడుతూ.. హీరో అవ్వాలి అనే నా 10 ఏళ్ల కళ. ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడి, తిండి తినకుండా కూడా ప్రయత్నాలు చేసి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు హీరోగా అయ్యాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అఫ్జల్, నిర్మాత షారుఖ్ లకు ధన్యవాదాలు అని అన్నారు.
Also Read : Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. అనేక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా మా ఒక్కరిది కాదు సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరిది. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.