10Max : 36 భాషల్లో కంగువ.. కన్నప్ప బర్త్‌డే గిఫ్ట్.. సింగం ఎగైన్..

36 భాషల్లో రిలీజ్ కాబోతున్న సూర్య 'కంగువ' సినిమా. ప్రభాస్ శివుడిగా, మంచు విష్ణు భక్త కన్నప్పగా నటిస్తున్న..

10Max : 36 భాషల్లో కంగువ.. కన్నప్ప బర్త్‌డే గిఫ్ట్.. సింగం ఎగైన్..

10max Latest Entertainment News Today on 21 November

Updated On : November 21, 2023 / 9:59 PM IST

ఆదికేశవ ట్రైలర్ వ్యూస్ అదుర్స్..
‘ఆదికేశవ’ సోషల్ మీడియాలో అదరగొడుతోంది. వైష్ణవ్ తేజ , శ్రీలీల జంటగా సితార, శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ లో తెరకెక్కిన ఆదికేశవ ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి 50 లక్షల వ్యూస్ క్రాస్ చేసింది.

హనుమాన్ థర్డ్ సాంగ్..
సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ‘హనుమాన్’.. అప్ డేట్స్ విషయంలో దూకుడు చూపిస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా థర్డ్ సాంగ్ ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం.

36 భాషల్లో కంగువ..
తమిళ్ స్టార్ హీరో సూర్య అప్ కమింగ్ మూవీ ‘కంగువ’.. గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా రిలీజ్ అవ్వని రేంజ్ లో 36 భాషల్లో 2డి, 3డిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

త్రిషకి చిరు సపోర్ట్..
మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ ని తప్పుపడుతూ త్రిషకి సపోర్ట్ గా నిలిచారు మెగాస్టార్. హీరోయిన్ అనేకాదు.. ఏ అమ్మాయినీ ఇలా కామెంట్ చెయ్యకూడదు. త్రిషకి నా ఫుల్ సపోర్ట్ అంటూ పోస్ట్ పెట్టారు మెగాస్టార్.

జాయ్ ఆఫ్ మై లైఫ్..
అల్లు అర్జున్ తన కూతురు అర్హకి బర్త్ డే విషెస్ చెప్పారు. జాయ్ ఆఫ్ మై లైఫ్ అంటూ క్యూట్ వీడియోతో అర్హని సోషల్ మీడియాలో విష్ చేశారు బన్నీ.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

‘మంగళవారం’ సక్సెస్..
పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన ‘మంగళవారం’ సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. చీఫ్ గెస్ట్ గా హీరో విశ్వక్ సేన్ హాజరై యూనిట్ కు విషెస్ తెలిపాడు.

‘కన్నప్ప’ అప్డేట్..
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇలా స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. విష్ణు బర్త్ డే సందర్భంగా నవంబర్ 23న ‘కన్నప్ప’ నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

‘పారిజాత పర్వం’ ఫస్ట్ లుక్..
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక లీడ్ రోల్స్ లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

‘సౌండ్ పార్టీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
వీజే స‌న్నీ, హ్రితిక జంటగా తెరకెక్కిన ‘సౌండ్ పార్టీ’ వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న రిలీజవుతున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

‘సింగం ఎగైన్’..
సింగం సిరీస్ సక్సెస్ రన్ కంటిన్యూ అవుతోంది. 12 ఏళ్ల క్రితం రోహిత్ శెట్టి స్టార్ట్ చేసిన సింగం సిరీస్ మీద జనాలకు క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఇక ఈ క్రేజ్ కి తగ్గట్టు సినిమాని కూడా అదే రేంజ్ లో తీస్తున్నారు రోహిత్ శెట్టి. లేటెస్ట్ గా సింగం సిరీస్ లో 3వ సినిమాగా వస్తున్న ‘సింగం ఎగైన్’ నుంచి అజయ్ దేవగన్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి..హైప్ పెంచేస్తోంది టీమ్ .

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)