చిరు ఇంట్లో ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ : తారలన్నీ ఒక చోట!

‘క్లాస్ఆఫ్ఎయిటీస్’.. టెన్త్ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో ఘనంగా జరిగింది.. 40 మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

  • Publish Date - November 25, 2019 / 04:56 AM IST

‘క్లాస్ఆఫ్ఎయిటీస్’.. టెన్త్ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో ఘనంగా జరిగింది.. 40 మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

మెగాస్టార్ చిరంజీవి ఇంట తారల సందడి నెలకొంది. అలనాటి తారాగణమంతా కలిసి ఆట పాటలతో, విందు వినోదాలతో హంగామా చేశారు. ‘క్లాస్ఆఫ్ఎయిటీస్’.. 1980 లో నటించిన స్టార్స్ తమ గ్రూప్‌కు పెట్టుకున్న పేరు ఇది. ప్రతి ఏడాది ఒక చోట కలుస్తూ రీ-యూనియన్ జరుపుకుంటూ ఉంటారు అప్పటి హీరో, హీరోయిన్లు. ఈ గ్రూప్‌లో మోహన్ లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, జగపతి బాబు, వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, జయప్రద, రమ్యకృష్ణ, ప్రభు, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, రేవతి, భాగ్యరాజ్, ఖుష్భూ, శరత్ కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్ తదితరులు ఉన్నారు.

వీళ్లు కలిసిన ప్రతిసారి ఆ పార్టీకి ఓ డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట రీ- యూనియన్ ప్లాన్ చేస్తారు. దాంతో పాటు టీమ్‌లో ఉన్న ఓ స్టార్ అందరికీ పార్టీ ఇస్తుంటారు. ఈ సంవత్సరం ‘క్లాస్ఆఫ్ఎయిటీస్’ పదో యానివర్శరీ. టెన్త్ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో ఘనంగా జరిగింది. ఇందుకోసం ఇటీవలే చిరంజీవి తన నివాసాన్ని కొత్త హంగులతో రీ మోడలింగ్ చేయించారు.

దాదాపు 40 మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సారి బ్లాక్ అండ్ గోల్డ్ డ్రెస్ కోడ్‌లో తారలంతా మెరిశారు. వీరితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడా కలిశారు. తారలందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడడం మూవీ లవర్స్‌కి ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి. ‘క్లాస్ఆఫ్ఎయిటీస్’ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.