బ‌ద్ధ‌కిష్టి సూర్య కిరణ్‌ ఔట్ దేవీ పర్‌ఫెక్ట్, తోపు గంగవ్వ, ఊపందుకున్న బిగ్‌బాస్

  • Published By: Suresh Kumar ,Published On : September 13, 2020 / 04:55 PM IST
బ‌ద్ధ‌కిష్టి సూర్య కిరణ్‌ ఔట్ దేవీ పర్‌ఫెక్ట్, తోపు గంగవ్వ, ఊపందుకున్న బిగ్‌బాస్

Updated On : September 13, 2020 / 5:44 PM IST

BIGG BOSS 4 Telugu 7TH DAY: శనివారం అంతా సందడే. అనుకున్నట్లే కింగ్‌ నాగార్జున్‌ చలాకీతనం, అనుభవంతో ఎపిసోడ్‌ లాక్కొచ్చాడు. ఫన్నీ టాస్క్‌ ఇచ్చి ఎంటర్‌టైన్‌తో పాటు ఇంటి సభ్యుల క్యారెక్టర్‌ ఏంటో బయటపడేలా చేశాడు.

రకరకాల బొమ్మలు ఉన్న కొన్ని మెడల్స్‌ ఇచ్చి, ఒక్కో మెడల్‌ ఎవరెవరికి ఇస్తారో రీజన్‌ చెప్పి మెడలో వేయాలని చెప్పారు హోస్ట్‌ నాగార్జున. ఈ టాస్క్‌కి బలి అయింది మాత్రం నైబర్‌ హౌస్‌ నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన సోహైల్‌, అరియానా అని చెప్పుకోవాలి.