ఆ అమ్మాయి ఉండి ఉంటుందా? సూపర్ ట్రైలర్
118 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.

118 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.
నందమూరి కళ్యాణ్ రామ్, నివేథా థామస్, షాలిని పాండే హీరో, హీరోయిన్స్‌గా, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ, 118. ఈ మూవీతో కె.వి.గుహన్‌డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మొన్నామధ్య రిలీజ్ చేసిన 118 ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా 118 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న 118 ట్రైలర్‌లో, విజువల్స్, ఆర్ఆర్, కళ్యాణ్ రామ్ నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. షాలినీ పాండేని పక్కన పెట్టి, కనిపించకుండా పోయిన నివేధా థామస్‌ని వెతుకుతున్నాడు కళ్యాణ్ రామ్..
నాజర్, ప్రభాస్ శ్రీను, హర్ష వర్థన్ తదితరులు నటిస్తున్న 118 మార్చి 1న రిలీజవుతుంది. ఈ సినిమాకి సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : తమ్మిరాజు, మాటలు : మిర్చి కిరణ్, వి.శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్, అన్బరివు, రియల్ సతీష్, కథ, సినిమాటోగ్రఫీ అండ్ దర్శకత్వం : కె.వి.గుహన్
వాచ్ ట్రైలర్…