Vikrant Massey : కొడుకు పేరు, పుట్టిన డేట్‌ని చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న హీరో..

ఓ హీరో తన కొడుకు పేరుతో పాటు పుట్టిన డేట్ ని కూడా తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.

12th Fail Fame Actor Vikrant Massey Tattooed his Son name and Birth Date on his Hand

Vikrant Massey : ఇటీవల చాలా మంది పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. కొంతమంది స్టైల్ కోసం అయితే కొంతమంది భక్తితో, ప్రేమతో వాళ్లకు ఇష్టమైన వాళ్ళ పేర్లు, లెటర్స్ పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. తాజాగా ఓ హీరో తన కొడుకు పేరుతో పాటు పుట్టిన డేట్ ని కూడా తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.

ఇటీవల 12th ఫెయిల్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరో విక్రాంత్ మస్సె కొంతకాలం క్రితం నటి శీతల ఠాకూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట గత నెల ఫిబ్రవరి 7న పండంటి బాబుకి జన్మనిచ్చారు. ఈ బాబుకి వర్ధన్ అని పేరు పెట్టారు. తాజాగా విక్రాంత్ మస్సె తన కొడుకు పేరు ఇంగ్లీష్ లో వర్ధన్ అని తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అలాగే పుట్టిన డేట్ 7-2-2024 అని కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు.

Also Read : Tillu Square Collections : వామ్మో రెండు రోజుల్లో ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ ఇన్ని కోట్లా? సిద్ధూ కెరీర్ హైయెస్ట్..

తన చేతిపై వేయించుకున్న పచ్చబొట్టుని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే బాబు పేరు ప్రేమతో రాయించుకున్నాడు అంటే ఓకే కానీ, పుట్టిన డేట్ కూడా ఎందుకు అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విక్రాంత్ మస్సె తన సినిమాతోనే కాక ఇప్పుడు పచ్చబొట్టుతో కూడా వైరల్ అవుతున్నాడు.