18 Pages Movie Runtime Locked
18 Pages: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘18 పేజెస్’ ఈవారంలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఓ మంచి లవ్ స్టోరీగా తెరకెక్కించగా, ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను కట్టిపడేయనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
18 Pages: 18 పేజెస్ ట్రైలర్.. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో వస్తున్న నిఖిల్, అనుపమ
డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌లు ఇటీవల ‘కార్తికేయ-2’ సినిమాలో నటించగా, ఆ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు రొమాంటిక్ సబ్జెక్ట్‌తో వస్తుండటంతో 18 పేజెస్ మూవీపై కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసిందట. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 17 నిమిషాలుగా ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్.
18 Pages: 18 పేజీస్ సెన్సార్ పూర్తి.. నిఖిల్ సినిమాకి కూడానా..?
ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీకి ఈ రన్‌టైమ్ కరెక్ట్‌గా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సుకుమార్ అందించిన కథ కావడంతో ఈ సినిమాపై చిత్ర వర్గాల్లో భారీ అంచనలే నెలకొన్నాయి. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా, బన్నీ వాస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.