35 Chinna Katha Kaadu A Good Emotional Content Movie Must watch with Your Children
35 Chinna Katha Kaadu : ఇటీవల పిల్లలతో కలిసి చూసే సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల చదువులు, వాళ్ళ ఎమోషన్స్ పై అసలు సినిమాలే రావట్లేదు. ఇలాంటి సమయంలో పిల్లలతో కలిసి చూసే ఒక మంచి సినిమా వచ్చింది. అదే ’35 చిన్న కథ కాదు’ సినిమా.
నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా.. పలువురు ముఖ్య పాత్రల్లో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాణంలో నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా రానా దగ్గుబాటి రిలీజ్ చేసాడు.
Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా నుంచి మాస్ జాతర సాంగ్ చూశారా..? భారీగా డిజైన్ చేశారుగా..
’35 చిన్న కథ కాదు’ సినిమా గత నెల సెప్టెంబర్ 6న థియేటర్స్ లో రిలీజవ్వగా ఇటీవల అక్టోబర్ 2న ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ మినిట్స్ పైగా వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఐదో తరగతి చదివే ఓ పిల్లాడికి లెక్కల్లో డౌట్స్ వస్తే ఎవరూ అతని డౌట్స్ చెప్పకపోవడంతో లెక్కలు సబ్జెక్టు పాస్ అవ్వాలనే పరిస్థితి రావడంతో ఆ పిల్లాడి కోసం తల్లి ఏం చేసింది అని ఎమోషనల్ గా చూపించారు.
ఈ సినిమాలో తల్లి పాత్రలో నివేద థామస్, కొడుకు పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ మాత్రం ప్రేక్షకులని మెప్పించి ఏడిపించేసారు కూడా. కచ్చితంగా మీ ఇంట్లో పిల్లలతో కలిసి ఆహ ఓటీటీలో ’35 చిన్న కథ కాదు’ సినిమాని కలిసి చూడండి.