Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా నుంచి మాస్ జాతర సాంగ్ చూశారా..? భారీగా డిజైన్ చేశారుగా..

ఇప్పటికే 'క' సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసారు.

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా నుంచి మాస్ జాతర సాంగ్ చూశారా..? భారీగా డిజైన్ చేశారుగా..

Kiran Abbavaram Ka Movie Mass jathara Song Released

Updated On : October 8, 2024 / 7:14 AM IST

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం త్వరలో ‘క’ అనే భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ‘క’ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసారు.

Also Read : Gorre Puranam : తెలుగు ఓటీటీ ఆహాలో మరో కొత్త సినిమా.. సుహాస్ ‘గొర్రె పురాణం’.. ఎప్పట్నించి అంటే..

‘క’ సినిమా నుంచి మాస్ జాతర అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను చూస్తుంటే ఊళ్ళో జరిగే ఓ జాతర సీన్ లో వచ్చే సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు సనాపాటి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా సామ్ సీఎస్ సంగీత దర్శకత్వంలో దివాకర్, సామ్ సీఎస్, అభిషేక్ ఏఆర్ పాడారు. ‘ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు..’ అంటూ జాతర సాంగ్ లా ఈ పాట ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ పాటకు పొలాకి విజయ్ మాస్ స్టెప్పులు కొరియోగ్రఫీ చేసారు. ఈ సాంగ్ లో కిరణ్ అబ్బవరం అదిరిపోయే డ్యాన్స్ చేసాడు. మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి..

ఇక ‘క’ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మలయాళంలో ఈ సినిమాని దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.